Horoscope Today
‘Today horoscope in telugu ‘: గ్రహాల మార్పు కారణంగా కొన్ని రాశుల్లో మార్పులు ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై స్వాతీ నక్షత్ర ప్రభావం ఉండనుంది. ఇదే సమయంలో మధ్య త్రికోణ యోగం ఏర్పడనుంది. దీంతో కొన్ని రాశుల వారు ఆర్థికంగా పుంజుకుంటారు. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఈ రాశి వారికి ఈరోజు శుభవార్తను అందుతాయి. అనుచరుల సహకారంతో వ్యాపారులు అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగులు లక్ష్యాలు పూర్తి చేయడంతో పదోన్నతులు పొందుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు ఉంటాయి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి ఉద్యోగులు కార్యాలయాలను మార్పులు చేస్తారు. దీంతో ఎక్కువ జీతం పొందే అవకాశం. తండ్రి ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే కొత్త వ్యక్తులను నమ్మకుండా ఉండాలి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు ఈ రోజు నిరాశతో ఉంటారు. కుటుంబంలో కొన్ని విభేదాల కారణంగా మనసు ఆందోళనగా ఉంటుంది. అయితే కోపం తెచ్చుకోవడం వల్ల ఈ సమస్య మరింత పెద్దదిగా కావచ్చు. అందువల్ల మాటలను అదుపులో ఉంచుకోవాలి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం గానే ఉంటుంది.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వ్యాపారంలో ఈరోజు భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని లాభదాయకమైన ఒప్పందాలు వచ్చినట్లే వచ్చి తిరిగి వెళ్తాయి. బంధువుల నుంచి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే వారికి అనుకూల సమయం. కుటుంబ సభ్యులతో విభేదాలు ఉంటాయి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : పాత స్నేహితులను కలుస్తారు. దీంతో ఆర్థిక ప్రయోజనాలు ఉండే అవకాశం. కొత్త పెట్టుబడులు పెడతారు. అనవసరపు ఖర్చులు ఉంటాయి. అందువల్ల ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఏ సమస్య ఉన్న వెంటనే పరిష్కరించుకోవాలి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు చట్టపరమైన సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వ్యాపారంలో కొత్తపెట్టబడులు పెడతారు. పిల్లలు పరీక్షలు రాసినట్లయితే విజయం సాధిస్తారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. దీంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు మార్గం ఏర్పరచుకుంటారు. కుటుంబ సభ్యుల్లో ఒకరితో వాగ్వాదం ఉంటుంది.. ఏ సమస్య ఉన్న వెంటనే పరిష్కరించుకోవాలి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : పెట్టుబడలు పెట్టాలనుకునే వారు పెద్దల సలహా తీసుకోవాలి. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం స్నేహితులను కలుస్తారు. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
ధనస్సు రాశి( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి అకస్మాత్తుగా అనారోగ్యం వచ్చే అవకాశం. పిల్లల ఆరోగ్యం పై కూడా శ్రద్ధ వహించాలి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆధ్యాత్మిక భావాలపై ఆసక్తి పుడుతుంది. కొన్ని వస్తువుల కోసం డబ్బులు ఖర్చు చేస్తారు. అయితే దుబారా ఖర్చులు పెట్టకుండా ఉండాలి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. జీవిత భాగస్వామితో వ్యాపారం చేసినట్లయితే లాభాలు అధికంగా వస్తాయి. బెట్టింగ్లో పెట్టుబడి పెట్టే వారికి ఈ రోజు కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. ఇష్టం లేని కొన్ని పనులను వాయిదా వేయడం మంచిది. తండ్రి ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. అనవసరపు వివాదాలకు దూరంగా ఉండాలి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : కొన్ని ఆందోళనను జయిస్తారు. దీంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది. సాయంత్రం స్నేహితులతో కలిసి ఉంటారు. ఇంటి చుట్టుపక్కల వారితో వాగ్వాదం ఉండే అవకాశం. అందువల్ల ఎవరితో ఎక్కువగా మాట్లాడకపోవడం మంచిది. జీవిత భాగస్వామికి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేస్తారు.