Viral Video: సెలబ్రిటీలు ఎదురైనప్పుడు.. ఏదైనా అరుదైన సందర్భాలు చోటు చేసుకున్నప్పుడు.. అద్భుతాలు ఆవిష్కృతమైనప్పుడు.. స్నేహితులు కలిసినప్పుడు.. రాకరాక బంధువులు ఇంటికి వచ్చినప్పుడు.. ప్రకృతిలో ఏదైనా దృశ్యం రమణీయంగా కనిపించినప్పుడు.. మనలో చాలామంది సెల్ఫీలు దిగుతుంటారు. అయితే ఈ సెల్ఫీలు మన దేశానికి వచ్చే విదేశీ పర్యాటకులకు ఇబ్బందికరంగా మారాయి.. సెల్ఫీల కోసం ఎగబడుతుండడం.. వారిని పదేపదే ఇబ్బంది పెడుతుండడంతో పర్యటకులు అవస్థలు పడుతున్నారు.. బయటికి నేరుగా చెప్పలేకపోయినప్పటికీ.. లోలోపల వారి తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సమస్యకు ఒక రష్యన్ టూరిస్ట్ అద్భుతమైన పరిష్కారాన్ని కనుగొన్నది. అది కాస్త సామాజిక మాధ్యమాలలో సంచలనంగా మారింది.
ఒక్క సెల్ఫీ కి ₹100
ఫోటోల వల్ల ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో రష్యన్ పర్యాటకురాలు (Russian tourist) వినూత్నమైన ఉపాయం (innovative thought) ఆలోచించింది.. దాని ప్రకారం ఆమెతో ఒక సెల్ఫీ తీసుకుంటే కచ్చితంగా 100 రూపాయలు ఇవ్వాలట. ఈ విషయాన్ని పేర్కొంటూ ఓ
ప్లకార్డును ప్రదర్శించింది. దీనిని వీడియో తీసి తన సోషల్ మీడియాలో అకౌంట్లో పోస్ట్ చేసింది. దెబ్బకు అది సంచలనంగా మారింది. ” నాకు ఇండియా అంటే అమితమైన గౌరవం. అందుకే ఈ దేశాన్ని చూడ్డానికి వస్తుంటాను. ఇక్కడ చాలా మంచి ప్రదేశాలు ఉంటాయి. అయితే వెళ్లిన ప్రతిచోటకు ప్రజలు వస్తుంటారు. సెల్ఫీలు దిగడానికి పోటీ పడుతుంటారు. అది నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. నాకే కాదు నాతోటి విదేశీ పర్యాటకు కూడా విసుగును కలిగిస్తుంది. అందువల్లే నేను ఈ ఆలోచనకు తెరలేపాను. ఒక్కో సెల్ఫీ కోసం ₹100 తీసుకుంటానని ప్లకార్డు ప్రదర్శించాను. దీంతో నాకు ఆ ఇబ్బంది తప్పింది. వంద రూపాయలు చెల్లించి సెల్ఫీలు దిగే వాళ్ళు కూడా వచ్చారు. అలా వారు ఇచ్చే వంద రూపాయల వల్ల నాకు కూడా ఎంతో కొంత ఆర్థిక భరోసా పెరిగిందని” ఆ రష్యన్ టూరిస్ట్ చెబుతోంది. అయితే కొంతమంది భారతీయులు మాత్రం ఆ రష్యన్ మహిళ చేస్తున్న పని పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సెల్ఫీ కోసం వంద రూపాయలు వసూలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మా దేశానికి విదేశీయులు వచ్చారు కాబట్టి .. దానికి గుర్తుగా ఒక ఫోటో దిగుతామని.. ఆ మాత్రం దానికి ఇలా వసూలు చేయడం ఏంటని మండిపడుతున్నారు. ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు తమను కూడా విదేశీయులు ఇలానే ఇబ్బంది పెడతారని.. కానీ మేము ఓర్పు, సహనాన్ని కలిగి ఉంటామని అంటున్నారు. భారతీయుల రక్తంలోనే అది ఉందని.. విదేశీయుల్లో అది ఉండదని వారు వివరిస్తున్నారు.
మన దేశానికి వచ్చే విదేశీ పర్యాటకులతో ఇక్కడి ప్రజలు ఫోటోలు దిగుతుంటారు. ఇలాంటి సందర్భంలో కొంతమంది విదేశీయులు ఇబ్బంది పడుతుంటారు. దీంతో ఓ రష్యన్ మహిళ సెల్ఫీ తీసుకుంటే ₹100 చెల్లించాలని ఫ్ల కార్డు ప్రదర్శించడంతో ఆమెకు ఆ ఇబ్బంది తప్పింది. #Russianlady#oneselfiecast100 pic.twitter.com/tWX8C3DtJz
— Anabothula Bhaskar (@AnabothulaB) January 20, 2025