Nara Lokesh : ఏపీలో కీలక నియోజకవర్గం లో మంగళగిరి ఒకటి. అక్కడ నారా లోకేష్ రెండోసారి పోటీ చేశారు. ఆ నియోజకవర్గంపై భారీ అంచనాలు ఉన్నాయి. అక్కడ గెలుపోటములపై చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఈసారి నారా లోకేష్ పై పాజిటివ్ కనిపిస్తోంది ఆ నియోజకవర్గంలో. గత ఎన్నికల్లో ఓడిపోయిన లోకేష్.. ఐదు సంవత్సరాలుగా గట్టిగానే పని చేశారు. నిత్యం నియోజకవర్గంలో పర్యటనలు చేస్తూ స్థానికులను కలుసుకునేవారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని చుట్టేశారు. దీంతో అక్కడ లోకేష్ కు అనుకూల పరిస్థితి వచ్చింది. అందుకే ఈసారి లోకేష్ గెలుస్తాడని చెప్పే కంటే.. ఓడిపోతాడు అన్న మాట వినిపించడం లేదు. ఇదే ఆయనకు ప్లస్ పాయింట్ గా మారింది. మంగళగిరి నియోజకవర్గంపై పెద్ద ఎత్తున బెట్టింగులకు కారణమవుతోంది.
గత ఎన్నికల్లో మంత్రిగా ఉన్న లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేశారు. టిడిపి ఆవిర్భావం తర్వాత ఒకటి రెండు సార్లు మాత్రమే అక్కడ టిడిపి గెలిచింది. అటువంటి చోట గెలిచి సత్తా చాటాలని లోకేష్ భావించారు. కానీ ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. దీంతో అంతా లోకేష్ మంగళగిరి నియోజకవర్గాన్ని విడిచిపెడతారని అనుమానించారు. కానీ గత ఐదు సంవత్సరాలుగా మంగళగిరి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేశారు. నిత్య పర్యటనలు చేస్తూ ప్రజలతో మమేకం అయ్యారు. అందుకే ఈసారి లోకేష్ పై సానుభూతి పనిచేసింది. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేకత, రాజధాని అంశం సైతం సానుకూలంగా మారింది. దీంతో లోకేష్ తప్పకుండా గెలుస్తాడు అన్న విశ్లేషణలు, అంచనాలు ప్రారంభం అయ్యాయి.
ఈనెల 13న పోలింగ్ జరిగింది. జూన్ 4న కౌంటింగ్ జరగనుంది. సుమారు మూడు వారాల గ్యాప్ వచ్చింది. రకరకాల ఊహాగానాలు, చర్చలు ప్రారంభం అయ్యాయి. అదే సమయంలో భారీ స్థాయిలో బెట్టింగులు జరుగుతున్నాయి. మంగళగిరి విషయానికి వచ్చేసరికి లోకేష్ ఓడిపోతాడని కానీ ఎవరు బెట్టింగ్ కట్టేందుకు ముందుకు రాలేదు. ఇక్కడ లోకేష్ కు సానుకూలత ఉందని ఇప్పటికే సంకేతాలు వచ్చాయి. ఎక్కువమంది ఆయన మెజారిటీపై పెడుతున్నారు. పది వేలు ఓట్లు, 20 వేల ఓట్లు, 30 వేల ఓట్లు అంటూ బెట్టింగులు సాగుతుండడం విశేషం. రాజకీయ ప్రత్యర్థుల సైతం ఈ బెట్టింగులు చూసి లోకేష్ కచ్చితంగా గెలుస్తాడని ఒక నిర్ణయానికి వస్తున్నారు. మరి ఏం జరుగుతుందో అన్నది జూన్ 4న తెలుస్తుంది.