Jobs crisis : వలస పోతున్న ఎంబీఏ పట్టభద్రులు..

డిజిటల్‌ యుగంలో విజయవంతం కావాలంటే బహుళ నైపుణ్యాలను కలిగి ఉండేలా విద్యార్థులను విద్యాసంస్థలు తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని గుప్తా తెలిపారు.

Written By: Raj Shekar, Updated On : May 27, 2024 9:24 am

jobs

Follow us on

Jobs crisis : ఎంబీఏ పట్టభద్రుల్లో వలసల రేటు అధికంగా కొనసాగుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా ప్రధాన ప్రాంగణాల నంచి నియమితులైన ప్రారంభ స్థాయి ఉద్యోగుల విషయంలో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. ఈమేరక డెలాయిట్‌ ఇండియా నివేదిక రూపొందించింది. దీని ప్రకారం.. దేశవ్యాప్తంగా మొదటి శ్రేణి(టైర్‌–1) కళాశాల ప్రాంగణాల నుంచి కొత్తగా నియమితులైన వారిలో వలసల రేటు 21 శాతంగా ఉంది. ఉద్యోగంలో చేరి ఒకటి, రెండేళ్లు పూర్తిచేసుకున్న ఉద్యోగుల్లో వలస రేటు 26 శాతం నుంచి 28 శాతం వరకు ఉంది.

ద్వితీయశ్రేణి నియామకాల్లోనూ..
ఇక ద్వితీశ్రేణి, తృతీయశ్రేణి ప్రాంగణాల్లో కొత్తగా నియమితులైన ఉద్యోగులు ఏడాది, రెండేళ్లు పేర్తి చేసుకున్న తర్వాత వలస వెళ్తున్నారు. ఈ రేటు కూడా క్రమంగా పెరుగుతోంది. మొదట 19 శాతం ఉండగా, తర్వాత 21, 25 శాతానికి చేరిందని డెలాయిట్‌ ఇండియా నివేదించింది.

కంపెనీల పునరాలోచనతో..
ఉద్యోగులు ముఖ్యంగా ఎంబీఏ పట్టభద్రులను అట్టే పెట్టుకునే విషయంలో కంపెనీలు పునరాలోచన చేయడమే వలసలకు కారణం అని నివేదిక గుర్తించింది. వీళ్లలో వరలస రేటు అధికంగా ఉండడం జాగ్రత్త పడాల్సిన అంశమని పేర్కొంది. వినూత్న విధానాలు దీర్ఘకాలం పాట పనిచేయవు. పోటీ మార్కెట్‌లో నైపుణ్యవంతులను అట్టేపెట్టుకోవడం ముఖ్యం అని డెలాయిట్‌ ఇండియా డైరెక్టర్‌ నిలేశ్‌గుప్తా తెలిపారు. 190 సంస్థలు, 500 ప్రాంగణాల నుంచి వివరాలు సేకరించి ఈ నివేదిక రూపొందించారు

నివేదికలో ముఖ్యాంశాలు..
– ప్రతీ ఐదురుగు ఉన్నతాధికారుల్లో నలుగురు నియామకాలు, వేతనం, ప్రోత్సాహకాలపై నిర్ణయాల్లో నైపుణ్యాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనివలన పక్షపాత ధోరణి తగ్గుతోంది. పారదర్శకత పెరుగుతోందని నివేదిక పేర్కొంది.

– డిజిటల్‌ యుగంలో విజయవంతం కావాలంటే బహుళ నైపుణ్యాలను కలిగి ఉండేలా విద్యార్థులను విద్యాసంస్థలు తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని గుప్తా తెలిపారు.

– వలసల రేటు అధికంగా ఉన్నప్పటికీ 70 శాతం సంస్థల నుంచి ఎంబీఏ పట్టభద్రులకు గిరాకీ ఎక్కువే ఉందని నివేదిక తెలిపింది. సంస్థల వ్యాపార విజయవంతంలో ఎంబీఏ పట్టభద్రులకన్నా ప్రాధాన్యాన్ని ఇది తెలియజేస్తుందని పేర్కొంది. గత ఐదేళ్లలో వీరి పారితోషికంలోనూ 5.2 శాతం వార్షిక వృద్ధి ఉందని పేర్కొంది.