Salaar 2 Update : ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ 2 అప్డేట్ ఇదే.. పుకార్లను నమ్మొద్దు!

ఇది చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. సలార్ 2 పై వచ్చే పుకార్లకు వాళ్ళు ఆ విధంగా చెక్ పెట్టారు.

Written By: NARESH, Updated On : May 27, 2024 10:07 am

Prabhas Fans Salaar 2 Update

Follow us on

Salaar 2 Update : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ పార్ట్ 1 భారీ విజయం సాధించింది. గత ఏడాది డిసెంబర్ 22న విడుదలైన ఈ చిత్రం దాదాపు రూ. 700 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. సలార్ లో యాక్షన్స్ సీన్స్, ప్రభాస్ లుక్ ఫ్యాన్స్ ని ఫిదా చేసాయి. సలార్ సీజ్ ఫైర్ లో ఎండింగ్ ట్విస్ట్ అయితే మాములుగా ఉండదు. దీంతో సలార్ 2 శౌర్యంగ పర్వం పై అభిమానుల్లో లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

సలార్ పార్ట్ 2 ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే సలార్ పార్ట్ 2 ఆగిపోయిందని. ఈ ప్రాజెక్టు ప్రశాంత్ నీల్ పక్కన పెట్టేశారంటూ తెగ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై తాజాగా మూవీ టీం క్లారిటీ ఇచ్చింది. సలార్ 2 ప్రొడక్షన్ ఈ నెలాఖరులో ప్రారంభం అవుతుందని చిత్ర నిర్మాతలు ప్రకటించారు. అయినా సలార్ అటకెక్కిందంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి.

ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ కీలక ప్రకటన చేశారు. నీల్ – తారక్ కాంబోలో రాబోతున్న ఎన్టీఆర్ 31 షూటింగ్ ఈ ఆగస్టు నుంచి ప్రారంభం అవుతుందని ప్రకటించారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ మరి సలార్ 2 ఎప్పుడు ఉంటుందని ఆందోళన పడ్డారు. అంతేకాదు ప్రశాంత్ సలార్ 2 ని పక్కన పెట్టి ఎన్టీఆర్ మూవీ ముందుగా కంప్లీట్ చేస్తారని కూడా అనుకున్నారు.

ఈ రూమర్స్ కి చెక్ పెడుతూ మూవీ టీం ఓ పోస్ట్ పెట్టింది. ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కలిసి నవ్వుతున్న ఫోటోను షేర్ చేశారు. వాళ్ళకి నవ్వు ఆగట్లేదు అంటూ క్యాప్షన్ ఇచ్చారు సలార్ టీం. ఇది చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. సలార్ 2 పై వచ్చే పుకార్లకు వాళ్ళు ఆ విధంగా చెక్ పెట్టారు.