YSR Congress : వైసీపీ దుకాణం బంద్ అయ్యింది.. ఇది విస్తరిస్తోందా? అదే కారణమా?

వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి రాయలసీమ జిల్లాలు అండగా నిలిచాయి. ఏకపక్ష విజయాన్ని అందించాయి. మరోవైపు నెల్లూరు జిల్లా సైతం అక్కున చేర్చుకుంది. కానీ ఈసారి మాత్రం వైసీపీకి ఛాన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు ద్వితీయ శ్రేణి క్యాడర్ సైతం వెళ్ళిపోతుండడంతో వైసిపి ఆందోళనతో ఉంది.

Written By: Dharma, Updated On : September 23, 2024 10:05 am

YSR Congress

Follow us on

YSR Congress :  నెల్లూరు జిల్లాలో వైసీపీ ఖాళీ అవుతోంది. ఎన్నికల్లో పదికి పది సీట్లను కూటమి కైవసం చేసుకుంది. దీంతో వైసిపి క్యాడర్ సైతం కూటమి వైపు మొగ్గు చూపుతోంది. ఇప్పటికే నెల్లూరు నగరపాలక సంస్థలో మెజారిటీ కార్పొరేటర్లు టిడిపి వైపు వచ్చారు. ఇప్పుడు తాజాగా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ టీడీపీ వశం అయింది. వైసిపి ఆవిర్భావం నుంచి నెల్లూరు జిల్లా ఆ పార్టీకి విన్నుదన్నుగా నిలుస్తూ వచ్చింది. 2014, 2019 ఎన్నికల్లో ఆ పార్టీ తిరుగులేని విజయం సాధించింది నెల్లూరు జిల్లాలో. అయితే ఇప్పుడు సీన్ మారింది. ఎన్నికలకు ముందు వైసీపీ ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులతో పాటు కీలక నేతలు టిడిపిలో చేరారు. దీంతో టీడీపీ బలం పుంజుకుంది. నేతలంతా సమన్వయంతో పని చేయడంతో పదికి పది అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది. ప్రస్తుతం దిక్కుతోచని స్థితిలో ఉన్న వైసీపీ క్యాడర్ టిడిపిలో చేరుతోంది.

* ముగ్గురు ఎమ్మెల్యేలు టిడిపిలో చేరిక
నెల్లూరు జిల్లాలో వైసీపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు టిడిపిలోకి జంప్ చేశారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతి రెడ్డి తదితరులు టిడిపిలోకి వచ్చారు. ఇందులో ఒక్క మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మినహాయించి అందరూ ఈ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులుగా పోటీ చేశారు. అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. నెల్లూరు జిల్లాలో వైసీపీకి ఉన్న పట్టుకోవడంతో ఆ పార్టీ శ్రేణులు విలవిలలాడుతున్నాయి. అందుకే సేఫ్ జోన్ కోసం టిడిపిలో చేరుతున్నాయి. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ తో పాటు మెజారిటీ కార్పొరేటర్లు టిడిపిలో చేరారు. త్వరలో నెల్లూరు నగర పాలక సంస్థపై టిడిపి జెండా ఎగురునుంది.

* టిడిపి ఖాతాలో బుచ్చిరెడ్డిపాలెం
తాజాగా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ చైర్ పర్సన్ సుప్రజ తో పాటు కౌన్సిలర్లు టిడిపి గూటికి వచ్చారు. ఎమ్మెల్యే వేంరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆధ్వర్యంలో వారంతా టిడిపిలో చేరారు. మంత్రి నారాయణ వారికి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ కండువాలను కప్పి చేర్చుకున్నారు. దీంతో వైసీపీకి షాక్ తగిలినట్లు అయ్యింది. జిల్లాలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎక్కువమంది టీడీపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే కేవలం అభ్యంతరం లేని వారిని మాత్రమే తీసుకునేందుకు టిడిపి ఆసక్తి చూపుతోంది. వివాదాస్పద నేతలను దూరంగా ఉంచాలని భావిస్తోంది.

* స్వయంకృతాపరాధం
నెల్లూరు జిల్లాలో వైసిపిది స్వయంకృతాపమే. బలమైన నాయకులను వదులుకుంది ఆ పార్టీ. అధినేతకు నమ్మిన బంటులుగా వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉండేవారు. కానీ వారి పట్ల జగన్ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో వారు మనస్థాపానికి గురయ్యారు. కనీసం సముదాయించుకపోగా.. రెచ్చగొట్టేలా పార్టీ నేతలు మాట్లాడారు. దీంతో పార్టీలో ఉండడం కంటే బయటకు వెళ్లిపోవడం మేలని వారు ఒక నిర్ణయానికి వచ్చారు. వైసిపికి జిల్లాలో ఇంతటి పరాజయానికి కూడా అదే కారణం. అయితే ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రాగా.. ఇప్పుడు ఉన్న క్యాడర్ సైతం టిడిపిలో చేరుతుండడంతో వైసీపీలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.