Ormax Stars India Loves 2024: బాలీవుడ్ కి చెందిన ఆర్మాక్స్ సంస్థ ప్రతి నెల వివిధ చిత్ర పరిశ్రమల పై సర్వేలు నిర్వహిస్తోంది. ప్రేక్షకుల ఒపీనియన్స్ ఆధారంగా నటులకు, సినిమాలకు, సీరియల్స్ కి, ఓటీటీ సిరీస్లు, షోలకు ర్యాంకింగ్స్ ప్రకటిస్తుంది. సెప్టెంబర్ నెలకు గాను టాప్ 10 పాన్ ఇండియా స్టార్స్ ని ఆర్మాక్స్ ప్రకటించింది. ఈ సర్వేలో అనూహ్య ఫలితాలు వచ్చాయి. కోలీవుడ్ స్టార్ అజిత్ కి 10వ ర్యాంక్ దక్కింది.
ఇక 9వ ర్యాంక్ రామ్ చరణ్ కైవసం చేసుకున్నాడు. గతంలో రామ్ చరణ్ టాప్ 5లో ఉన్నాడు. ఇక 8వ ర్యాంక్ సల్మాన్ ఖాన్ కి దక్కింది. సల్మాన్ ఖాన్ బాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరు. కాకపోతే ఆయన విజయాల పరంగా వెనుకబడ్డారు. దాంతో ఆయన ర్యాంక్ పడిపోయింది. 7వ ర్యాంక్ అల్లు అర్జున్ సొంతం చేసుకున్నారు. అల్లు అర్జున్ ర్యాంక్ సైతం క్రిందకు జారింది. గతంలో ఆయన టాప్ 5లో ఉన్నారు.
పుష్ప విడుదలైతే అల్లు అర్జున్ ర్యాంక్ మెరుగయ్యే అవకాశం ఉంది. 6వ ర్యాంక్ ప్రేక్షకులు అక్షయ్ కుమార్ కి ఇచ్చారు. జయాపజయాలతో సంబంధం లేకుండా అక్షయ్ కుమార్ సినిమాలు చేస్తున్నారు. ఈ కారణంగా ఆయన మెరుగైన ర్యాంక్ దక్కించుకున్నారు. ఇక 5వ ర్యాంక్ ఎన్టీఆర్ కైవసం చేసుకున్నాడు. ఎన్టీఆర్ నటించిన దేవర విడుదలకు సిద్ధమైంది. ఆయన బాలీవుడ్ లో దేవర చిత్రాన్ని గట్టిగా ప్రమోట్ చేశారు.
దేవర విజయం సాధిస్తే ఎన్టీఆర్ రేంజ్ మరింత పెరుగుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఆడియన్స్ 4వ ర్యాంక్ కట్టబెట్టారు. మహేష్ బాబు ఒక్క పాన్ ఇండియా చిత్రం చేయలేదు. అయినప్పటికీ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ కంటే మెరుగైన ర్యాంక్ రాబట్టాడు. రాజమౌళితో ఆయన మూవీ ప్రకటించడం కూడా దీనికి కారణం.
ఇక 3వ ర్యాంక్ షారుఖ్ ఖాన్ సొంతం చేసుకున్నాడు. 2023 షారుఖ్ ఖాన్ కి బాగా కలిసొచ్చింది. పఠాన్, జవాన్ చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ నమోదు చేశాడు. డంకీ సైతం ఓ మోస్తరు విజయం అందుకుంది. దాంతో ఆయన రేసులో దూసుకొచ్చాడు. కోలీవుడ్ స్టార్ విజయ్ కి 2వ ర్యాంక్ దక్కింది. విజయ్ కి సైతం ఒక్క పాన్ ఇండియా హిట్ లేదు. అయినప్పటికీ ఆయనకు జనాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది.
ఫైనల్లీ నెంబర్ 1 ర్యాంక్ ప్రభాస్ దక్కించుకున్నాడు. దేశంలోనే అతిపెద్ద హీరో ప్రభాస్ అని ఆడియన్స్ తేల్చేశారు. ప్రభాస్ కి వరుస ప్లాప్స్ పడ్డాయి. అయితే సలార్ తో హిట్ ట్రాక్ ఎక్కాడు. కల్కి 2898 AD ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసింది. వరల్డ్ వైడ్ రూ. 1200 కోట్లు రాబట్టింది. ప్రస్తుతానికి ప్రభాస్ దే అగ్రస్థానం.
Ormax Stars India Loves: Most popular male film stars in India (Jul 2024) #OrmaxSIL pic.twitter.com/IpQ93MMbia
— Ormax Media (@OrmaxMedia) August 22, 2024