Lokesh : తెలుగుదేశం పార్టీకి( Telugu Desam Party) బలం ఆ పార్టీ కార్యకర్తలే. చెక్కుచెదరని బలం ఆ పార్టీ సొంతం. ఒక ప్రాంతీయ పార్టీ నాలుగు దశాబ్దాల పాటు నిలవడం అంటే ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో చాలా అరుదైన విషయం. అటువంటి అరుదైన అవకాశాన్ని అధిగమించిన టిడిపి నిజంగా బలమైన పార్టీ. ఈ విషయంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబును అభినందించాల్సిందే. కార్యకర్తలకు పెద్దపీట వేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయాలే.. ఇంతటి బలానికి కారణాలు అయ్యాయి. తెలుగుదేశం పార్టీ పడిపోయిన ప్రతిసారి కార్యకర్తలు రెట్టింపు బలంతో పనిచేసేవారు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అందుకే ఇప్పుడు కార్యకర్తల బాగోగులను సైతం చూసుకుంటున్నారు చిన్న బాబు లోకేష్. వారితో మమేకమై పని చేస్తున్నారు. తాజాగా ఈరోజు చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఒక సామాన్య టీడీపీ కార్యకర్త కళ్ళల్లో ఆనందం నింపారు నారా లోకేష్. ఇప్పుడు అదే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read : ప్రధాని చెంతకు లోకేష్.. చంద్రబాబు నయా ప్లాన్!
* మహానాడుకు వెళుతూ..
కుప్పం( Kuppam) నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు సొంత ఇంటిని కట్టుకున్నారు. నిన్ననే గృహప్రవేశం కూడా చేశారు. కార్యక్రమానికి చంద్రబాబు కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. దాదాపు నియోజకవర్గంలోని ఓ పాతికవేల మందికి భోజన ఏర్పాట్లు కూడా చేశారు. కుప్పం నియోజకవర్గంలోని ప్రతి పల్లె నుంచి జనం భారీగా వచ్చారు. తమ ఎమ్మెల్యే, సీఎం చంద్రబాబు ఆతిథ్యాన్ని స్వీకరించారు. అటు నుంచి అటే మహానాడుకు వెళ్లారు. మరోవైపు నారా లోకేష్ ఈరోజు మహానాడుకు కుప్పం నుంచి బయలుదేరారు. మార్గమధ్యలో శాంతిపురం గ్రామంలో పార్టీ కార్యకర్త చంగాచారి నిర్వహిస్తున్న టీ స్టాల్ వద్ద ఆగారు. టీ కొట్టు వద్ద ఆగి చెంగాచారి తో మాట్లాడారు. అన్నా చాలా దూరం వెళ్ళాలి టీ ఇస్తావా అని నారా లోకేష్ అడిగారు. లోకేష్ ను చూసిన చంగాచారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అక్కడ ఉన్నవారు సైతం లోకేష్ ను చూసి ఆశ్చర్యపోయారు. ఆయనతో మాట్లాడేందుకు, ఫోటోలు తీసుకునేందుకు ఆసక్తి చూపారు.
* ఆనందానికి అవధులు లేవు..
చెంగాచారి( Changa Chari) లోకేష్ కు గాజు గ్లాసులు టీ అందించాడు. వ్యాపారం ఎలా ఉంది అని లోకేష్ ఆరా తీశాడు. సార్ నేను 1994 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉంటున్న. నాకు చంద్రబాబు అంటే అభిమానం. నేను టిడిపికి చెందిన వాడి నన్ను కోపంతో ఐదేళ్లుగా నా టీ కొట్టు ముగించేశారు అని చెంగాచారి వివరించాడు. జూన్ 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక.. 17వ తేదీన మళ్లీ టీ కొట్టు ప్రారంభించ అని నారా లోకేష్ కు తెలిపాడు. నాకు ఇద్దరు ఆడబిడ్డలు, ఒక ఆడబిడ్డ కు పెళ్లయిందని.. మరో పిల్లకు పెళ్లి చేయాల్సి ఉందని చెంగాచారి చెప్పాడు. మీరు మా అంగడికి రావడం నమ్మలేకపోతున్నాను చిన్నయ్య అంటూ ఆప్యాయంగా మాట్లాడాడు. అయితే దీనిపై స్పందించిన లోకేష్ ఇప్పుడు నువ్వు ఎవరికీ భయపడాల్సిన పనిలేదు. నీ వెంట నేనున్నా.. ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చెయ్ అని లోకేష్ సూచించాడు. అనంతరం చంగాచారి కుటుంబంతో లోకేష్ ఫోటోలకు దిగారు. ఆ గ్రామంలోని నాయకులు, గ్రామస్తులతో కూడా లోకేష్ మాట్లాడారు. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.