Kannappa : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు (Mohan Babu) కి నటుడిగా చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించిన ఆయన విలన్ గా, కామెడీ విలన్ గా, హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు రకాల పాత్రల్లో నటించి మెప్పించే ప్రయత్నం చేశాడు. ఇక ఆయన నట వారసులుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మంచు విష్ణు, మంచు మనోజ్ లు సైతం ఆశించిన మేరకు హీరోలుగా రాణించలేకపోయారు. ఇక ప్రస్తుతం మంచు విష్ణు మాత్రం 150 కోట్ల భారీ బడ్జెట్ తో ‘కన్నప్ప’ (Kannappa) అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాతో తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. పాన్ ఇండియాలో ఈ సినిమాకి మంచి గౌరవం దక్కుతుంది అని ఆయన భావిస్తున్నాడు. ఇక ముఖ్యంగా ఈ సినిమాకి మంచి బజ్ రావడానికి ముఖ్య కారణం ఏంటి అంటే ఇందులో ప్రభాస్ రుద్ర అనే క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. దానివల్లే ఈ సినిమా మీద భారీ బజ్ అయితే క్రియేట్ అవుతుంది. మరి తొందర్లోనే రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమా మీద మంచు విష్ణు భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ ని సాధిస్తే ఆయన పాన్ ఇండియా హీరోగా మారిపోతా అనే ఒక నమ్మకాన్ని అయితే వ్యక్తం చేస్తున్నాడు.
ఈ సినిమా మంచు విష్ణు కెరియర్ కి ఎలాంటి టర్నింగ్ పాయింట్ అవుతుంది అనే విషయాన్ని పక్కన పెడితే ప్రభాస్ ఇమేజ్ ఏమైనా తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయా అంటూ ప్రభాస్ అభిమానులు కొంతవరకు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. నిజానికి మంచు విష్ణు ఇచ్చే ఇంటర్వ్యూలో కూడా ప్రభాస్ ను కొంతవరకు తక్కువ చేసి మాట్లాడుతూ ఉండడం అతని అభిమానులకు నచ్చడం లేదు.
Also Read : ప్రభాస్ కోసమే కన్నప్ప చూస్తారా..? ఆయన స్క్రీన్ టైమ్ ఎంతంటే..?
అయినప్పటికి ఈ సినిమాలో చిన్న మిస్టేక్ జరిగి ప్రభాస్ క్యారెక్టర్ లో అంత డెప్త్ లేకపోతే మాత్రం ప్రభాస్ అభిమానులు ఈ సినిమాను బాయ్ కట్ చేసే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ సినిమాలో ప్రభాస్ ని తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో అతని పాత్రను స్క్రీన్ మీద అంత బాగా రక్తి కట్టించే విధంగా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్…
ఒకవేళ ప్రభాస్ అభిమానులను డిసప్పాయింట్ చేసినట్లయితే మాత్రం వాళ్లు భారీ రేంజ్ లో ఈ సినిమా మీద నెగెటివిటీ ని స్ప్రెడ్ చేసే అవకాశాలైతే ఉన్నాయి. అవన్నీ చూసుకొని ఈ సినిమాను రిలీజ్ చేస్తే బాగుంటుందని కొంతమంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…