Liquor scam : మద్యం కుంభకోణం( liquor scam) కేసులో జగన్ పై ఈడిని ప్రయోగించనున్నారా? కూటమి ప్రభుత్వం పావులు కదుపుతోందా? కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆధారాలు సమర్పించిందా? ఇక నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమేనా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసిపి హయాంలో జరిగిన మద్యం కుంభకోణం పై దృష్టి పెట్టింది. సిఐడి దర్యాప్తు కూడా కొనసాగించింది. ఇప్పుడు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ విచారణ కూడా జరుగుతోంది. ఇది ఒక కొలిక్కి రావడంతో.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రంగంలోకి దిగాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి వినతులు వెళుతున్నాయి. అయితే ఇది జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉచ్చు అని తెలుస్తోంది.
* కేంద్రానికి ఆధారాలతో ఫిర్యాదు..
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ( YSR Congress party ) హయాంలో భారీ మద్యం కుంభకోణం జరిగిందని టిడిపి కూటమి ఆరోపించింది. పార్లమెంటులో అయితే టిడిపి పార్లమెంటరీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు దీనిపై ఆరోపణలు చేశారు. కుంభకోణానికి సంబంధించి ఆధారాలతో సహా కేంద్ర హోమ్ శాఖ మంత్రి కి ఫిర్యాదు చేశారు. దాదాపు 4వేల కోట్ల రూపాయలు హవాలా ద్వారా విదేశాలకు పంపించారని.. ఇందులోనాటి సీఎం జగన్మోహన్ రెడ్డి హస్తం కూడా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే కేంద్ర హోంశాఖ మంత్రికి ఫిర్యాదు చేసిన తరువాత ప్రత్యేక దర్యాప్తు బృందం దూకుడు పెంచింది.
Also Read : ఈడీ చేతికి ఏపీ మద్యం కుంభకోణం!
* విజయసాయిరెడ్డి వాంగ్మూలంతో..
మరోవైపు ఈ కేసులో ఏ 5 నిందితుడిగా ఉన్నారు విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy). అంతకుముందు ఓ కేసు విచారణ కోసం సిఐడి ఎదుటకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మద్యం కుంభకోణంలో తన పాత్ర లేదని.. రాజ్ కసిరెడ్డి సూత్రధారి అని తేల్చి చెప్పారు. ప్రత్యేక దర్యాప్తు బృందం పిలిస్తే తన వద్ద ఉన్న వివరాలను అందిస్తానని కూడా అన్నారు. దీంతో ప్రత్యేక దర్యాప్తు బృందం విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఆయన విచారణకు సైతం హాజరయ్యారు. ఆ సమయంలోనే కీలక వివరాలు ఇచ్చారు. అటు తర్వాత రాజ్ కసిరెడ్డి అరెస్టు జరిగింది. విచారణలో ఆయన కీలక అంశాలను వెల్లడించారు. దీంతో సిట్ మద్యం కుంభకోణం లో 3,500 కోట్ల రూపాయలు పక్కదారి పట్టినట్లు నిర్ధారణకు వచ్చింది. విచారణకు సంబంధించిన ఆధారాలతో సహా కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విచారణ చేపట్టాలని సూచించింది. దీంతో ఈడి నుంచి ప్రత్యేక దర్యాప్తు బృందానికి కొన్ని సూచనలు వచ్చాయి. వాటి మేరకు ఆధారాలను సమర్పించింది సిట్.
Also Read : విప్పింది సగం బట్టలే.. విజయసాయి రెడ్డి సంచలన కామెంట్స్!
* అప్పట్లో చంద్రబాబు విషయంలో..
అయితే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగించడం కోసమే ఈడిని రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. గతంలో చంద్రబాబు( CM Chandrababu) స్కిల్ స్కాంలో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో చాలా రకాల కేసులను చంద్రబాబుపై నమోదు చేసింది నాటి సిఐడి. అయితే ఈ కేసుల విషయంలో ఈడి ఎంట్రీ కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయితే రాజకీయ కక్షపూరిత కేసులు కావడంతో ఈడి ఎంటర్ కాలేదు. అందుకే చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్టు చేసింది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో ఈడి ఎలా స్పందిస్తుంది అన్నది చూడాలి. అయితే కేంద్రంలో టిడిపి కీలక భాగస్వామి కావడంతో.. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం టిడిపి రాజకీయ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తుందన్న టాక్ వినిపిస్తోంది. మొత్తానికి అయితే జగన్మోహన్ రెడ్డికి ఈడి భయం వెంటాడుతోంది.