AP Liquor scam: ఏపీ మద్యం కుంభకోణంలో( liquor scam ) కీలక పరిణామం. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వంలో మద్యం కుంభకోణం జరిగినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ తేల్చింది. రూ.3200 కోట్ల లిక్కర్ స్కాం జరిగినట్లు నిర్ధారించింది. కీలక అరెస్టులను సైతం పూర్తి చేసింది. త్వరలో ఎలక వ్యక్తిని అరెస్టు చేస్తారని ప్రచారం జరిగింది. ఇలాంటి సమయంలో ఓ ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. మనీలాండరింగ్ చట్టం కింద దర్యాప్తు చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ సిద్ధమవుతోంది. ఇప్పటివరకు జరిగిన విచారణలో తేలిన అంశాలు, ఆధారాలు తమకు ఇవ్వాలంటూ సిట్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కోరినట్లు తెలుస్తోంది.
* విజయవాడ సిపి నేతృత్వంలో..
విజయవాడ నగర పోలీస్ కమిషనర్( Vijayawada city police commissioner) రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటైన సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా మద్యం కుంభకోణానికి సంబంధించి సమగ్ర దర్యాప్తు ఈ బృందం చేస్తోంది. ముఖ్యంగా రాజ్ కసిరెడ్డి అరెస్టు తర్వాత ఈ మొత్తం కుంభకోణం పై ఒక నిర్ధారణకు వచ్చింది ప్రత్యేక దర్యాప్తు బృందం. ఈ తరుణంలో ఈడి ఎంట్రీ ఇచ్చింది. మొత్తం వివరాలను తమకు ఇవ్వాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కోరినట్లు తెలుస్తోంది. సిట్ అధిపతిగా ఉన్న విజయవాడ కమిషనర్ కు లేఖ రాసినట్లు సమాచారం. దీంతో త్వరలో ఈ వివరాలను వీడితో కూడా పంచుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ సిద్ధమవుతోంది. సిట్ నుంచి వివరాలు రాగానే ఈడి ఈ కేసును మనీ లాండరింగ్ చట్టం కింద నమోదు చేసి దర్యాప్తు చేయనుంది.
Also Read: AP High alert : ఏపీలో విచిత్రం.. ఆ జిల్లాలకు హై అలెర్ట్!
* అధికారంలోకి వచ్చిన వెంటనే ఫోకస్..
కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం కుంభకోణం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. సిఐడి దర్యాప్తు చేసింది. ప్రాథమిక వివరాలను వెల్లడించింది. అయితే సిఐడి దర్యాప్తు ఒక్కటే చాలదని.. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ కూడా అవసరమని భావించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మొత్తం ప్రాథమిక అంశాలతో పాటు లోతైన విచారణ జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈడి ఎంట్రీ ఇచ్చింది. నమోదు చేసిన ఎఫ్ఐఆర్ తో పాటు సీజ్ చేసిన బ్యాంక్ ఖాతాల వివరాలు కూడా కోరినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సూత్రధారిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి, ఆయన అనుచరుడు మహిళా దిలీప్ కూడా అరెస్టు అయ్యారు. వీరితోపాటు మాజీ సీఎం జగన్కు కార్యదర్శిగా పనిచేసిన ధనుంజయ రెడ్డి, ఓ ఎస్ బీ గా పని చేసిన కృష్ణమోహన్ రెడ్డి, మరో నిందితుడు గోవిందప్ప అరెస్టుకు రంగం సిద్ధమవుతోంది. వీరికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో అరెస్టు చేసేందుకు సిట్ గాలిస్తోంది.
Also Read: Operation Sindoor: మోడీ గురించి.. ఆపరేషన్ సింధూర్ గురించి రామ్ గారి విశ్లేషణ ఇదీ!
* పక్కా ఆధారాలతో పావులు..
వాస్తవానికి కూటమి ప్రభుత్వం పక్కా ఆధారాలతో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) హయాంలో మద్యం కుంభకోణం జరిగినట్లు గుర్తించింది. కీలక నేత హస్తం ఉందని అనుమానిస్తోంది. పార్లమెంటులో టిడిపి పక్ష నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ అంశంపైనే మాట్లాడారు. అటు తరువాత కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాను కలిసి కీలక ఆధారాలు చూపించారు. అప్పటినుంచి మద్యం కుంభకోణం వేగవంతం అయ్యింది. సిట్ దూకుడుగా అడుగులు వేస్తోంది. అరెస్టులు సైతం కొనసాగాయి. ఇప్పుడు మనీ లాండరింగ్ కింద ఈడి ఎంటర్ కావడంతో.. కేసు మరింత బిగిసుకునే పరిస్థితి ఉంది.