https://oktelugu.com/

ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. భారీ వేతనంతో 147 ఉద్యోగాలు..?

తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. రాష్ట్రంలోని జిల్లాలలో ఉన్న యానిమల్‌ డిసీజ్‌ డయాగ్నస్టిక్‌ ల్యాబొరేటరీల్లో ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా ఎస్వీ యూనివర్సిటీ భర్తీ జరగనుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో స్థానికులకు ప్రాధాన్యత ఉంటుంది. Also Read: నిరుద్యోగులకు మరో శుభవార్త.. భారీ వేతనంతో 1809 ఉద్యోగాలు..? ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 9, 2021 / 03:56 PM IST
    Follow us on

    తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. రాష్ట్రంలోని జిల్లాలలో ఉన్న యానిమల్‌ డిసీజ్‌ డయాగ్నస్టిక్‌ ల్యాబొరేటరీల్లో ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా ఎస్వీ యూనివర్సిటీ భర్తీ జరగనుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో స్థానికులకు ప్రాధాన్యత ఉంటుంది.

    Also Read: నిరుద్యోగులకు మరో శుభవార్త.. భారీ వేతనంతో 1809 ఉద్యోగాలు..?

    ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి అర్హతతో పాటు డిప్లొమా ఇన్‌ మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ కోర్సును పూర్తి చేసి ఉండాలి. 2020 సంవత్సరం జులై నెల 1వ తేదీ నాటికి 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నిబంధనల మేరకు దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు, మాజీ సైనికులకు వయో సడలింపులు ఉంటాయి.

    Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. భారీ వేతనంతో 200 ఉద్యోగాలు..?

    డిప్లొమా ఇన్‌ మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ కోర్సులో అభ్యర్థులు సాధించిన మార్కులను బట్టి ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అభ్యర్థులు సమాన మార్కులను సాధిస్తే పదో తరగతి మార్కులు, వయస్సు ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఒప్పంద వ్యవధి సంవత్సరం కాగా ఎంపికైన అభ్యర్థులకు నెలకు 17,500 రూపాయలు వేతనంగా లభిస్తుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు 200 రూపాయలుగా ఉంటుంది.

    మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు

    ఇప్పటికే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా మార్చి 20వ తేదీ ఉద్యోగాలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. www.svvu.edu.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.