https://oktelugu.com/

హృతిక్ రోషన్ తో పటాస్ తీస్తా.. అనిల్ రావిపూడి సంచలన ప్రకటన

ప్రస్తుతం ‘ఎఫ్3’ మూవీలో బిజీగా ఉన్న అనిల్ రావిపూడి తాను దర్శకత్వ పర్యవేక్షణ చేసి స్క్రీన్ ప్లే అందించిన ‘గాలి సంపత్’ విడుదలకు రెడీ అయ్యింది. ఆ సినిమా ప్రమోషన్ లో మాట్లాడిన అనిల్ సంచలన విషయాలు చెప్పుకున్నారు. బాలక్రిష్ణతో సినిమా కథ లైన్ ను ఆయనకు చెప్పానని.. ఇక మహేష్ తోనూ మూవీ ఉంటుందని అనిల్ రావిపూడి తెలిపాడు. మహేష్ ను కలిసి త్వరలోనే మాట్లాడుతానని వివరించారు. అయితే ఇవన్నీ పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు […]

Written By:
  • NARESH
  • , Updated On : March 9, 2021 / 03:42 PM IST
    Follow us on

    ప్రస్తుతం ‘ఎఫ్3’ మూవీలో బిజీగా ఉన్న అనిల్ రావిపూడి తాను దర్శకత్వ పర్యవేక్షణ చేసి స్క్రీన్ ప్లే అందించిన ‘గాలి సంపత్’ విడుదలకు రెడీ అయ్యింది. ఆ సినిమా ప్రమోషన్ లో మాట్లాడిన అనిల్ సంచలన విషయాలు చెప్పుకున్నారు.

    బాలక్రిష్ణతో సినిమా కథ లైన్ ను ఆయనకు చెప్పానని.. ఇక మహేష్ తోనూ మూవీ ఉంటుందని అనిల్ రావిపూడి తెలిపాడు. మహేష్ ను కలిసి త్వరలోనే మాట్లాడుతానని వివరించారు. అయితే ఇవన్నీ పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు అని అనిల్ తెలిపాడు. హీరో రామ్ తోనూ ఓ సినిమా చేయాల్సి ఉందన్నాడు.

    ఇక తన మనసులోని మాటను అనిల్ రావిపూడి బయటపెట్టాడు. బాలీవుడ్ లో రిమేక్ చేసే చాన్స్ వస్తే తాను హృతిక్ రోషన్ తో రిమేక్ చేస్తానని దర్శకుడు అనిల్ రావిపూడి సంచలన ప్రకటన చేశాడు. హృతిక్ సిక్స్ ప్యాక్ బాడీ సెటప్ అంతా పెట్టుకుంటాడు కానీ.. సరైన సినిమా పడడం లేదని.. తనకు అవకాశం వస్తే హృతిక్ తో పటాస్ రిమేక్ చేస్తానని అనిల్ చెప్పుకొచ్చాడు.

    అంత కటౌట్ పెట్టుకొని హృతిక్ తో ఏవేవో సినిమాలు చేస్తున్నారని.. పటాస్ లాంటి యాక్షన్ మూవీ అతడితో చేయాలని అనిల్ రావిపూడి తన మనసులోని మాట బయటపెట్టాడు.