మనలో చాలామంది వయస్సుకు మించి బరువు ఉంటే ఇతర ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంటుందని భయాందోళనకు గురవుతూ ఉంటారు. మారుతున్న జీవనశైలి వల్ల ప్రధానంగా మనలో చాలామంది అధికబరువుతో బాధ పడుతూ ఉంటారు. అయితే నీళ్లు తాగడం ద్వారా సులభంగా బరువు తగ్గవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలోని కొవ్వు, కేలరీలను కరిగించే గుణం నీళ్లకు ఉందని వైద్యులు వెల్లడిస్తున్నారు.
Also Read: మధుమేహులు పుచ్చకాయను తినవచ్చా..? తినకూడదా..?
బరువు తగ్గడం కొరకు వేలకు వేలు ఖర్చు చేయడం కంటే నీళ్లు తాగడం ద్వారా బరువు తగ్గడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. శాస్త్రవేత్తల అధ్యయనాలు సైతం నీళ్లు తాగడం వల్ల బరువు తగ్గవచ్చని వెల్లడిస్తున్నాయి. శాస్త్రవేత్తలు పరిశోధనల్లో భాగంగా కొంతమందికి కేవలం లిక్విడ్ ఫుడ్ మాత్రమే ఇవ్వగా వాళ్లలో చాలామంది బరువు తగ్గడంతో పాటు కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉన్నాయి.
Also Read: అరటిపండ్లు తింటే బరువు పెరుగుతారా..? తగ్గుతారా..?
ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో నీళ్లు సహాయపడతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ భోజనానికి పావుగంట ముందు కడుపునిండా నీళ్లు తాగితే ఆకలి తగ్గి బరువు తగ్గే అవకాశం ఉంటుంది. అధిక బరువు ఉన్నవాళ్లు నీళ్లు ఎక్కువగా తాగితే కొవ్వు, కార్బొహైడ్రేట్స్ సులభంగా కరుగుతాయి. శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ ను తొలగించడంలో నీళ్లు సహాయపడతాయి.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
మనకు ఆకలి వేసిన సమయంలో వాటర్ తాగితే కేలరీలు తగ్గి బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి. ప్రతిరోజూ నీళ్లు ఎక్కువగా తాగుతూ వ్యాయామం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. అయితే నీళ్లు ఎక్కువగా తాగాలనుకునేవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే నీళ్లను తీసుకుంటే మంచిది.