Kuna Ravikumar Allegations: నిన్నంతా ఏపీలో ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ గురించే చర్చ జరిగింది. వైసీపీ సోషల్ మీడియా ట్రూత్ బాంబు పేరుతో విడుదల చేసిన వీడియో సంచలనంగా మారింది. దీనిని ఓ వర్గం మీడియా పెద్దగా పట్టించుకోలేదు కానీ.. మిగతా మీడియా సంస్థలు విపరీతంగా ప్రచారం చేశాయి.
Also Read: పులివెందుల్లో ఓటమి అంచుల్లో వైఎస్.. చంద్రబాబు రంగంలోకి దిగారు.. ఆ తర్వాత ఏమైందంటే?
కూన రవికుమార్ మహిళా ఉద్యోగులను వేధిస్తున్నారని.. పక్కలోకి రావాలని ఇబ్బంది పెడుతున్నారని వైసిపి ఆరోపించింది. దానికి తగ్గట్టుగానే కొన్ని ఫోటోలను కూడా సోషల్ మీడియాలో ఉంచింది. ఒకరకంగా ఇది టిడిపికి ఇబ్బందికరంగా మారింది. ఈ నష్టాన్ని ఎలా పూడుచుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలోకి దిగి.. రవికుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా కూటమి ప్రభుత్వ అనుకూల మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న చర్చ ప్రకారం కూన రవికుమార్ ను ఆయన వాళ్లే మోసం చేశారని తెలుస్తోంది. కావాలనే ఆయనను బలి చేశారని సమాచారం..
ఆయన నియోజకవర్గ పరిధిలో ఉన్న కేజీవీబీ ఉద్యోగులతో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుతున్నప్పుడు.. స్క్రీన్ షాట్లు తీసి వైసిపి శిబిరానికి అందించినట్టు సమాచారం. దొరికిందే అదునుగా వైసీపీ రెచ్చిపోయింది. కేజీబీవీ ప్రిన్సిపల్ తో ఏకంగా తన చానల్లో మాట్లాడించింది. మొత్తం గా రవికుమార్ ను దోషిగా చేసింది. వ్యవహారం మొత్తం ఇబ్బందికరంగా మారుతున్న నేపథ్యంలో రవి కుమార్ స్పందించక తప్పలేదు..
Also Read: రంగులు మారుతున్న రాజకీయాలు
కేజీబీవీ లో అవినీతి అక్రమాలపై తాను ప్రశ్నించానని.. అందువల్లే ప్రిన్సిపాల్ వైసిపి నేతలతో కలిసి తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు. విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహించిన కార్యక్రమం పై ముగ్గురు ప్రిన్సిపల్స్ తో కలిసి తాను వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించానని.. కేవలం పొందూరు ప్రిన్సిపల్ తోనే వీడియో కాల్ మాట్లాడినట్టు ఫేక్ ఫోటోలు సృష్టించారని రవికుమార్ ఆరోపించారు. అయితే నిన్నంతా రవికుమార్ వ్యవహార శైలిపై చర్చ జరిగింది. జరగాల్సిన నష్టం కూడా జరిగిపోయింది. దీనిపై రవికుమార్ ఇప్పుడు ఎన్ని మాటలు మాట్లాడినా ఉపయోగం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.