https://oktelugu.com/

Kumari Aunty: ఏపీ పొలిటికల్ స్టార్ క్యాంపైనర్ గా కుమారి ఆంటీ

తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ఇటీవల మరో యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. మీరు అభిమానించే పార్టీ ఏది అంటూ యాంకర్ అడిగేసరికి.. తనకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి చంద్రబాబుకి ఓటు వేశాను అంటూ కుమారి ఆంటీ చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Written By:
  • Dharma
  • , Updated On : February 1, 2024 / 04:32 PM IST
    Follow us on

    Kumari Aunty: సోషల్ మీడియాలో కుమారి ఆంటీ రచ్చ ఆగడం లేదు. తెలంగాణలో ఆమె వ్యాపారానికి బ్రేక్ పడటం.. ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. రెండు పార్టీల మధ్య వివాదం చెలరేగింది. హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి సమీపంలో ఉన్న ఐటీసీ కోహినూర్ పక్కన ఉండే రోడ్లలో ఫుట్ పాత్ మీద భోజనం అమ్ముకుంటూ ఆమె జీవనోపాధి సాగించేవారు. ఇటీవల యూట్యూబ్ లో బాగా ఫేమస్ అయ్యారు. ఆమెను ఇంటర్వ్యూ చేసిన యూట్యూబ్ ఛానల్ లో తనకు సీఎం జగన్ ఇచ్చిన ఇల్లు ఉందని చెప్పడంతో వైసీపీ సోషల్ మీడియా రెచ్చిపోయింది. తన అనుకూల ప్రచారానికి వాడేసుకుంది. దీంతో కుమారి ఆంటీ పై రాజకీయం మొదలైంది.

    తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ఇటీవల మరో యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. మీరు అభిమానించే పార్టీ ఏది అంటూ యాంకర్ అడిగేసరికి.. తనకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి చంద్రబాబుకి ఓటు వేశాను అంటూ కుమారి ఆంటీ చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘ఆవిడ క్లియర్ గానే ఉంది.. వీళ్ళకి చాలా సస్పెన్స్ తర్వాత అర్థమయ్యింది’ అంటూ అదుర్స్ సినిమాలో బ్రహ్మానందం డైలాగును గుర్తుచేస్తూ… ఇప్పుడు పేటీఎం బ్యాచ్ పరిస్థితి ఏంటో అంటూ టిడిపి కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఎక్స్ వేదికగా దీన్ని ట్రెండింగ్ చేస్తున్నారు. కుమారి ఆంటీ జగన్ ఇల్లు ఇచ్చారని చెప్పిన వీడియోను వైసిపి ప్రచారం చేస్తుంటే.. కుమారి ఆంటీ టిడిపి అభిమాని అని.. ఆమె తన ఓటు తెలుగుదేశం పార్టీకే వేసిందని ఆమెనే స్వయంగా చెప్పిన వీడియోను టిడిపి శ్రేణులు ట్రెండ్ చేస్తున్నారు.

    మొత్తానికైతే కుమారి ఆంటీ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయారు. సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఫేమస్ అయిన ఆమెను.. తమ రాజకీయ ప్రచారం కోసం అటు టిడిపి, ఇటు వైసిపి ఆరాటపడుతుండడం విశేషం. ఆమెను ఒక స్టార్ క్యాంపైనర్ గా మార్చుకునే పనిలో ఈ రెండు రాజకీయ పార్టీలు బిజీగా ఉన్నాయి. మున్ముందు ఏపీ రాజకీయాల్లో కుమారి ఆంటీ ఎంత ఫేమస్ అవుతారో చూడాలి. అయితే ఆమె హైదరాబాదులో ఉండగా.. తెలంగాణ రాజకీయ పార్టీలు పట్టించుకోకపోవడం విశేషం.