https://oktelugu.com/

Star Heroines: ఈ సంవత్సరం పెళ్లి చేసుకోబోతున్న స్టార్లు.. మీ అభిమాన స్టార్లు ఈ లిస్ట్ లో ఉన్నారా?

రకుల్ ప్రీత్ సింగ్ ఈ సంవత్సరం పెళ్లి కబురు చెప్పి అందరినీ సంతోష పెట్టనుందని టాక్. ఈ నెల 22వ తేదీన రకుల్ జాకీ భగ్నానీ వివాహం జరుగుతుందని టాక్. అయితే వీరి పెళ్లి గోవాలోని ఒక రిసార్ట్ లో గ్రాండ్ గా జరగనుందని సినిమా ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

Written By:
  • S Reddy
  • , Updated On : February 1, 2024 / 04:29 PM IST

    Star Heroines

    Follow us on

    Star Heroines: పెళ్లి అనే బంధం ఎప్పుడైనా పవిత్రమైన బంధమే. ఇక మామూలు ప్రజల నుంచి స్టార్ సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు పెళ్లి చేసుకోవాల్సిందే. చాలా తక్కు మంది మాత్రమే పెళ్లి చేసుకోకుండా జీవితాన్ని గడిపేస్తుంటారు. కానీ ప్రతి ఒక్కరు ఈ బంధంలో అడుగుపెట్టాల్సిందే. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలోని చాలా మంది హీరోయిన్ లు ఈ ఏడాది పెళ్లి చేసుకొని వారి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పడానికి రెడీ అవుతున్నారు. అంతే కాదు డై హార్డ్ ఫ్యాన్స్ హృదయాలను బ్రేక్ కూడా చేయనున్నారట.

    రకుల్ ప్రీత్ సింగ్ ఈ సంవత్సరం పెళ్లి కబురు చెప్పి అందరినీ సంతోష పెట్టనుందని టాక్. ఈ నెల 22వ తేదీన రకుల్ జాకీ భగ్నానీ వివాహం జరుగుతుందని టాక్. అయితే వీరి పెళ్లి గోవాలోని ఒక రిసార్ట్ లో గ్రాండ్ గా జరగనుందని సినిమా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ డెస్టినేషన్ వెడ్డింగ్ కు సంబంధించిన పిలుపునివ్వడంతో రకుల్ ప్రీతి సింగ్ మిడిల్ ఈస్ట్ లో జరగాల్సిన పెళ్లి వేడుక గోవాలో జరగనుందని సమాచారం అందుతోంది. ఇక ఈ అమ్మడు పెళ్లి మాత్రమే కాదు మిల్క్ బ్యూటీ పెళ్లి కూడా జరగనుందట.

    ప్రస్తుతం టెంపుల్స్ కు వెళ్తూ అందరిని షాక్ కు గురి చేస్తుంది తమన్నా. ఇక ఈ అమ్మడు విజయ్ వర్మను పెళ్లి చేసుకోనుందని సినిమా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయానికి సంబంధించి తమన్నా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అయితే వీరు రిలేషన్ లో ఉన్నారని గతం నుంచే టాక్ ఉంది. కానీ ఈ విషయంపై ఇద్దరు కూడా స్పందించలేదు. ఇక మరో బ్యూటీ కృతి కర్భందా, పుల్కిత్ సామ్రాట్ తో ఇప్పటికే నిశ్చితార్థం జరుపుకుంది. కానీ పెళ్లి తేదీపై క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తం మీద ఈ సంవత్సరమే పెళ్లి జరగనుందని టాక్.

    మరో స్టార్ హీరోయిన్ మీరాచోప్రా ఈ సంవత్సరం మార్చి నెలలో పెళ్లి చేసుకోబోతుందట. రాబోయే మూడు నెలల్లో చాలా మంది సెలబ్రెటీలు పెళ్లిళ్లకు సంబంధించిన తీపి కబురు అందించనున్నారని టాక్. ఫిబ్రవరి నెల 10 నుంచి ముహూర్తాలు ఉండడంతో చాలా మంది సెలబ్రెటీలు పెళ్లికి ముస్తాబవుతున్నారు. అయితే ఇప్పటికే పెళ్లి కానీ స్టార్లు ఎందరో ఉన్నారు. అందరికి ఎప్పుడు పెళ్లి అవుతుందో అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.