YCP: ఏపీలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. ఎగ్జిట్ పోల్స్(Exit Polls) ఫలితాల ప్రకారం గెలుస్తుందన్న టిడిపి కూటమి సైలెంట్ గా ఉంది. వైసిపి మాత్రం తెగ హడావిడి చేస్తోంది. టిడిపి(TDP), బిజెపి(BJP), జనసేన(Janasena) నేతలు మౌనంగా ఉన్నారు. వైసీపీ నేతలు మాత్రం గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ పార్టీ క్యాడర్ కు అదే భరోసా కల్పిస్తున్నారు.మనదే గెలుపు అని సంకేతాలు పంపిస్తున్నారు. దీంతో అసలు ఏం జరుగుతుందన్న కన్ఫ్యూజన్ సామాన్యుల్లో ఉంది. ఎగ్జిట్ పోల్ చరిత్రలోనే అత్యంత క్రెడిబిలిటీ ఉన్న ఇండియా టుడే సంస్థ టిడిపి కూటమిదే అధికారం అని తేల్చేసింది. ఆరా మస్తాన్ మాత్రం వైసీపీకి ఫేవర్ గా ఫలితాలు ఇచ్చింది. దానిని పట్టుకొనే సాక్షిలో ప్రసారాలు చేస్తున్నారు. పార్టీ శ్రేణులకు ఒక ఇండికేషన్ పంపుతున్నారు.
Also Read: Pawan Kalyan: ఆ విషయంలో పవన్ కి క్రెడిట్
మరికొద్ది గంటల వ్యవధిలో వాస్తవ ఫలితాలు రానున్నాయి. కానీ ఇప్పటికీ పార్టీ శ్రేణులకు నాయకత్వం భ్రమల్లోనే ఉంచుతోంది.అటు వైసీపీ శ్రేణులు కూడా ఏం జరుగుతుందో తెలియక సతమతం అవుతున్నాయి. గెలిచే కూటమి సైలెంట్ గా ఉండగా.. ఓడిపోయే సంకేతాలు ఉండగా.. ఇలా హడావిడి చేస్తుండడం ఏమిటన్న ప్రశ్న వైసీపీ శ్రేణుల నుంచి వినిపిస్తోంది. వాస్తవానికి వైసీపీకి ఘోర పరాజయం ఉంటుందని దాదాపు అన్ని సర్వే సంస్థలు చెప్పుకొచ్చాయి. చివరకు ఇండియా టుడే సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. 23 వరకు పార్లమెంట్ స్థానాలు కూటమికి కట్టబెట్టింది. దారుణ ఓటమి తప్పదని సంకేతాలు ఇచ్చింది. అయినా సరే వైసీపీ వెనక్కి తగ్గడం లేదు. మనదే గెలుపు అంటూ ప్రచారం చేసుకుంటోంది.
Also Read: CM Jagan : జగన్ కు అభ్యర్థులతో మాట్లాడే తీరిక లేదా?
అయితే వైసిపి ఈ ధీమా పంతం వెనుక పెద్ద కథ ఉంది. ముందే ఓటమిని అంగీకరిస్తే కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు ఏజెంట్లు భయపడతారు. గత ఐదు సంవత్సరాలుగా జరిగిన పరిణామాలతో రాజకీయ ప్రత్యర్థులకు టార్గెట్ అవుతారు. కేసులు, దాడులతో ప్రతీకరకాంక్షతో ప్రత్యర్థులు ఉన్నారు. ఒకవేళ కౌంటింగ్ ఏజెంట్ గా వెళ్తే భవిష్యత్తులో టార్గెట్ అవుతామని నేతలు భయపడతారు. అందుకే వారిలో ధైర్యం నింపాలంటే గెలుపు ధీమా ఉండాలన్నదే వైసీపీ నాయకత్వం అభిమతం. అందుకే చివరి వరకు గెలుస్తామన్న ధీమా పార్టీ శ్రేణులకు పంపాలని వైసిపి గట్టిగా డిసైడ్ అయ్యింది. ఇప్పటికే అధికార యంత్రాంగంలో పట్టు కోల్పోయింది. అటు పోలీస్ వ్యవస్థ సైతం సహకరించడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీ శ్రేణులు భయపడితే.. అసలుకే ఎసరు వస్తుందన్న భయం నిలువునా వెంటాడుతోంది. అందుకే ఆ తరహా ప్రచారం చేయడం వైసీపీకి అనివార్యంగా మారింది.