Homeఆంధ్రప్రదేశ్‌Andhra Pradesh: ఏపీలో మిగిలేదెవరు?

Andhra Pradesh: ఏపీలో మిగిలేదెవరు?

Andhra Pradesh: మరికొద్ది గంటల్లో ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఏపీలో విజేత ఎవరు అన్నది తెలియనుంది. అంతకంటే ముందే వచ్చిన ఎగ్జిట్ పోల్స్(Exit Polls) సర్వత్రా ఉత్కంఠ రేపాయి. మెజారిటీ సర్వేలు టిడిపి కూటమికి జై కొట్టాయి. లోకల్ సమస్యలు మాత్రం వైసిపికి(YCP) అనుకూలంగా ఫలితాలు ఇచ్చాయి. అయితే క్రెడిబిలిటీ ఉన్న సంస్థలు టిడిపి(TDP) కూటమి అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పాయి. ఇక ఫలితాలు లాంఛనమేనని స్పష్టం చేశాయి. అయితే కూటమి గెలిస్తే వైసిపి పరిస్థితి ఏంటి? వైసీపీ గెలిస్తే టిడిపి పరిస్థితి ఏంటి? అన్నదానిపై ఇప్పుడు బలమైన చర్చ నడుస్తోంది. దేశ రాజకీయాల్లో ఏపీ పాలిటిక్స్ భిన్నం. ఇక్కడ కులాలు, సామాజిక వర్గాల ప్రభావం అధికం. రాష్ట్ర విభజన తర్వాత మరీ ఎక్కువ అయింది. గత ఐదు సంవత్సరాల్లో ప్రతీకార రాజకీయాలు పెరిగాయి.

Also Read: Balakrishna : బాలయ్యకు ఆ వ్యసనం ఉంది… సొంత అల్లుడు బయటపెట్టిన చేదు నిజం!

తమిళనాడులో దశాబ్దాలుగా ఇదే పరిస్థితి ఉండేది. ఒకరు అధికారంలోకి వస్తే మరో పార్టీని ఇబ్బంది పెట్టడం ఆనవాయితీగా వచ్చింది. కరుణానిధిని జైల్లో పెట్టగలిగారు జయలలిత. అటు తరువాత అధికారంలోకి వచ్చిన జయలలిత కరుణానిధిని కేసుల్లో ఇరికించారు. జైల్లో పెట్టారు. అయితే ఇటీవల స్టాలిన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టాక.. రివేంజ్ రాజకీయాలకు చెక్ చెప్పారు.అయితే తమిళనాడులో ప్రాంతీయవాదం అధికం. ద్రవిడ హక్కులకు భంగం వాటిల్లితే.. రాజకీయ అజెండాను పక్కనపెట్టి మరి అన్ని పార్టీలు ఏకమవుతాయి. గతంలో చాలా సందర్భాల్లో ఇది రుజువు అయ్యింది. అవసరమైతే కేంద్ర ప్రభుత్వాన్ని సైతం అన్ని పార్టీలు కలిసి ఎదిరిస్తాయి. అయితే ఆ తరహా ప్రయత్నం ఏపీలో లేదు. ఒకరికి మిత్రుడు.. మరొకరికి శత్రువు అన్నట్టు కేంద్రంతో ఇక్కడ వ్యవహరిస్తారు. కేంద్ర సాయంతోనే సొంత రాష్ట్రంలో రివేంజ్ రాజకీయాలకు ప్రయత్నిస్తారు.

Also Read: YCP: కౌంటింగ్ ఏజెంట్ల కోసమే వైసిపి ఆ ప్రచారం

అవినీతి కేసుల్లో జగన్(Jagan) అరెస్ట్ అయ్యారు. 16 నెలల పాటు జైలు జీవితం అనుభవించారు. చంద్రబాబు సహకారంతో కాంగ్రెస్ కేసులు నమోదు చేసిందని జగన్ అనుమానించారు. అందుకే చంద్రబాబు(Chandrababu) పై రివెంజ్ కు డిసైడ్ అయ్యారు. సరిగ్గా ఎన్నికలకు ఆరు నెలల ముంగిట చంద్రబాబుపై అవినీతి కేసులను వెలికి తీశారు. పూర్తిస్థాయి ఆధారాలు లేకపోయినా.. చట్టంలో ఉన్న చిన్నపాటి అవకాశాలతో చంద్రబాబుపై అభియోగాలు మోపారు. దాదాపు 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచగలిగారు. అయితే ఇప్పుడు టిడిపి కూటమి అధికారంలోకి వస్తే.. అంతకుమించి రివేంజ్ రాజకీయాలు నడుస్తాయని సంకేతాలు ఉన్నాయి. అవినీతి చేసిన మంత్రులను, సహకరించిన అధికారులను వదిలిపెట్టే ప్రసక్తి లేదని చంద్రబాబు, పవన్, లోకేష్ పలు సందర్భాల్లో హెచ్చరించారు. లోకేష్ అయితే అటువంటి వారి పేర్లతో రెడ్ బుక్ రాశారు. ఏ ఒక్కరిని విడిచి పెట్టేది లేదని హెచ్చరించారు. ఇటువంటి పరిస్థితులు ఉన్న తరుణంలో.. చంద్రబాబు అధికారంలో వస్తే జగన్ ను, జగన్ అధికారంలోకి వస్తే చంద్రబాబును నిర్వీర్యం చేసేందుకు వెనుకాడరు. ఇది ముమ్మాటికి వాస్తవమని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version