https://oktelugu.com/

Kodali Nani: చంద్రబాబూ.. నీ జీవితంలో ఒక్కసారైనా తిరుమలలో గుండు కొట్టించుకున్నావా?*

ఐదేళ్ల వైసిపి పాలనలో చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడేవారు మాజీ మంత్రి కొడాలి నాని. ఆయన చంద్రబాబు వ్యక్తిగత జీవితంపై కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు వైసీపీకి ఓటమి ఎదురయ్యేసరికి కొడాలి నాని పరిస్థితి ఏంటి అన్న చర్చ నడిచింది. అందుకు తగ్గట్టుగానే నాని సైలెంట్ గా ఉండేవారు. తాజాగా తిరుపతి లడ్డు వ్యవహారంలో స్పందించడం విశేషం.

Written By:
  • Dharma
  • , Updated On : September 25, 2024 9:23 pm
    Kodali Nani(1)

    Kodali Nani(1)

    Follow us on

    Kodali Nani: తిరుపతి లడ్డు వివాదం పెను రూపం దాల్చుతోంది. జాతీయస్థాయిలో సైతం చర్చకు దారి తీసింది. ఈ వివాదంతో కోట్లాదిమంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 150 కోట్ల మంది హిందువులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. వైసిపి హయాంలో తప్పు జరిగిందన్నది టిడిపి నేతలు ఆరోపించారు. ప్రభుత్వ అధినేతగా చంద్రబాబు సైతం ప్రకటించేసరికి ఇది మరింత వివాదాస్పదం అయింది.వైసిపి కార్నర్ అవుతోంది. ఆ పార్టీకి చెందిన టిటిడి మాజీ చైర్మన్లు వై వి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. ఈ ఘటనను ఖండించారు. జగన్ సైతం స్పందించారు. ఇది చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ గా అభివర్ణించారు. మరోవైపు హైకోర్టును ఆశ్రయించారు. సి.బి.ఐ తో కానీ.. సుప్రీంకోర్టు సింగిల్ జడ్జితో కానీ విచారణ చేపట్టాలని పిటీషన్ దాఖలు చేశారు. అయినా సరేటిడిపి కూటమి నేతలు, ప్రజా ప్రతినిధులు వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. వైసీపీ నుంచి అనుకున్నంత స్థాయిలో స్పందన లేదన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, వైసిపి ఫైర్ బ్రాండ్ కొడాలి నాని స్పందించారు.

    * ఓటమి తరువాత సైలెంట్
    వైసిపి ఓటమి తర్వాత కొడాలి నాని పెద్దగా మాట్లాడడం లేదు.రాజకీయంగా సైలెంట్ అయ్యారు. ఇప్పుడు లడ్డు వివాదం నేపథ్యంలో స్పందించారు. మరోసారి చంద్రబాబు తీరుపై విరుచుకుపడ్డారు.చంద్రబాబు రాజకీయాల కోసం దేవుడిపై పడ్డారని ఎద్దేవా చేశారు. స్వార్థం కోసం ఎంతటి దూరానికైనా వెళ్లేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉంటారని కూడా చెప్పుకొచ్చారు. ఆయన శ్రీవారి భక్తుడు అయితే.. ఎన్నిసార్లు గుండు కొట్టించుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. తాను ప్రతి సంవత్సరం తిరుమల వెళ్తానని.. తలనీలాలు సమర్పించుకుంటానని కొడాలి నాని స్పష్టం చేశారు. ఇప్పుడు నాని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    * నిబంధనల ప్రస్తావన
    లడ్డు తయారీకి సంబంధించి నూనె విషయంలో టీటీడీలో ఎన్నో నిబంధనలు ఉన్న విషయాన్ని కొడాలి నాని ప్రస్తావించారు. క్వాలిటీ కంట్రోల్ అనుమతి ఇచ్చాక మాత్రమే నెయ్యి ట్యాంకర్లు తిరుమల చేరుకుంటాయని గుర్తు చేశారు. నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని ఏ ల్యాబ్ ఇంతవరకు నిర్ధారించలేదన్నారు. కేవలం అనుమానం మాత్రమే వ్యక్తమైన విషయాన్ని ప్రస్తావించారు. కానీ చంద్రబాబు రాజకీయాల కోసం వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చారని… దేవుడిని రాజకీయాల కోసంవినియోగించుకునే నీచ సంస్కృతి చంద్రబాబుది అని విరుచుకుపడ్డారు. నేరుగా జగన్ తో రాజకీయంగా బలపడలేక దేవుడిని తీసుకొచ్చారని చెప్పుకొచ్చారు కొడాలి నాని.

    * సడన్ ఎంట్రీ
    గత కొంతకాలంగా రాజకీయంగా సైలెంట్ గా ఉన్నారు చూడాలి నాని.గుడివాడ నియోజకవర్గ కేంద్రంగా అనేక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.గత ఐదేళ్లుగా కొడాలి నాని అనుచరుల చేతిలో ఉన్న భూములను సైతం ఇటీవల వెనక్కి లాక్కుని.. యజమానులకు అప్పగించారు. అప్పుడు కూడా కొడాలి నాని స్పందించలేదు. ఇటీవల వరదలకు గుడివాడలో చాలా ప్రాంతాలు ముంపు బారిన పడ్డాయి. అటువంటి సమయంలో కూడా కొడాలి నాని స్పందించిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు తిరుపతి లడ్డు వివాదంలో స్పందించడం గమనార్హం. ఈ వివాదంలో వైసిపి కార్నర్ కావడంతోనే కొడాలి నానిని ప్రయోగించారని ప్రచారం జరుగుతోంది. అయితే కొడాలి నాని ఎంట్రీ తో ఈ పరిణామం ఎటు తిరుగుతుందో చూడాలి.