IPL 2025: వారికి ఉద్వాసన తప్పదు.. ఈసారి పకడ్బందీ ప్లాన్ తో వెళుతోన్న బెంగళూరు జట్టు

ఐపీఎల్ లో ఒక్క ట్రోఫీ కూడా నెగ్గకపోయినప్పటికీ బెంగళూరు జట్టుకు మంచి పేరే ఉంది. ఆ జట్టుకు టాప్ -3 టీమ్ లతో సమానమైన బ్రాండ్ వాల్యూ ఉంది

Written By: Anabothula Bhaskar, Updated On : September 25, 2024 9:32 pm

IPL 2025

Follow us on

IPL 2025: ఐపీఎల్ -24 సీజన్ కు సంబంధించి వేలం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బెంగళూరు జట్టు రిటైన్ పై జాబితాను సిద్ధం చేస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకూ బెంగళూరు జట్టు నుంచి అధికారిక ప్రకటన విడుదల కాలేదు.. స్పోర్ట్స్ వర్గాల అంచనా, జాతీయ మీడియా కథనాల ప్రకారం ఇద్దరు స్టార్ ఆటగాళ్లను బెంగళూరు విడుదల చేసే అవకాశం ఉందట.. రిటైన్ చేసుకునే ఆటగాళ్ల సంఖ్యను ఇంకా ఈ బీసీసీఐ ఖరారు చేయకపోయినప్పటికీ.. రి టెన్షన్ రైట్ టు మ్యాచ్ అనే ఆప్షన్ తో కలిపి ఏకంగా ఆరుగురు ఆటగాళ్ళను బెంగళూరు తన వద్ద ఉంచుకుంటుందని తెలుస్తోంది. దీంతో ఐదుగురితో కూడిన రి టెన్షన్ జాబితాను బెంగళూరు జట్టు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ, మహమ్మద్ సిరాజ్, యశ్ దయాళ్, రజత్ పాటిదార్, విల్ జాక్స్ కు అవకాశం లభిస్తుందని తెలుస్తోంది. అందరూ అంచనా వేసినట్టుగానే కెప్టెన్ ఫాఫ్ డూ ప్లెసిస్ కు మంగళం పాడినట్టు తెలుస్తోంది. అతడు ఇటీవల ఐపీఎల్ లో పెద్దగా రాణించలేదు. పైగా అతని వయసు 40 సంవత్సరాలకు చేరుకుంది.. అతని బదులు మరొక ఆటగాడిని తీసుకొని జుట్టు బాధ్యతలు అప్పగించాలని బెంగళూరు యాజమాన్యం ఆలోచన చేస్తోందని తెలుస్తోంది. అయితే ఈ సీజన్లో మాక్స్ వెల్ కు అవకాశం ఇవ్వడం లేదని తెలుస్తోంది. కామె రూన్ గ్రీన్ ను కూడా పక్కన పెట్టారని సమాచారం.

నవంబర్లో వేలం

నవంబర్ రెండవ వారంలో ఐపీఎల్ వేలం జరుగుతుంది. ఈసారి కూడా దుబాయ్ లోనే వేలం నిర్వహించేందుకు బీసీసీఐ ఆలోచన చేస్తోంది. ఇప్పటికే కోల్ కతా, ఢిల్లీ, చెన్నై జట్లు తమ రిటైన్ జాబితాను సిద్ధం చేశాయి. అయితే వీటిపై ఏ జట్టు యాజమాన్యాలు కూడా అధికారికంగా వివరాలు ప్రకటించలేదు. స్పోర్ట్స్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం.. చెన్నై జట్టు రుతు రాజ్ గైక్వాడ్ కు కెప్టెన్సీ ఇవ్వనుంది. రవీంద్ర జడేజా, శివం దుబే, మతిష పతిరణ, ధోనిని కొనసాగించుకొనుంది. ఢిల్లీ జట్టను పరిశీలిస్తే రిషబ్ పంత్ కు కెప్టెన్సీ అప్పగించనుంది. అక్షర్ పటేల్, కులదీప్ యాదవ్, జేక్ ఫ్లేజర్, ట్రిస్టన్ స్టబ్స్ ను అంటిపెట్టుకోనుంది. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు శ్రేయస్ అయ్యర్ కు కెప్టెన్సీ ఇవ్వనుంది. రింకు సింగ్, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, ఫిల్ సాల్ట్ కు తిరిగి అవకాశాలు ఇవ్వనుంది. అయితే పై జాబితాలు ప్రచారంలో మాత్రమే ఉన్నాయి. ఇంతవరకు ఆ జట్లు అధికారికంగా ఆటగాళ్ల పేర్లు వెల్లడించలేదు. వేలం దశకు వచ్చేసరికి.. మరిన్ని ఊహగానాలు చక్కర్లు కొడతాయని స్పోర్ట్స్ వర్గాలు చెబుతున్నాయి.