Homeఆంధ్రప్రదేశ్‌Kodali Nani Arrest: కొడాలి నాని అరెస్ట్.. పోలీసులకు చిక్కిన ఆధారం!

Kodali Nani Arrest: కొడాలి నాని అరెస్ట్.. పోలీసులకు చిక్కిన ఆధారం!

Kodali Nani Arrest: ఏపీలో( Andhra Pradesh) అరెస్టుల పర్వం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గత కొంతకాలంగా ఇది నిలిచిపోయింది. అయితే ఇప్పుడు మరో నేరం ఒకటి బయటకు వచ్చింది. గుడివాడలో బెట్టింగ్ కు పాల్పడే మసాలా శివ అనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆయన మాజీమంత్రి కొడాలి నాని అనుచరుడు అని ప్రచారం నడుస్తోంది. గతంలో గుడివాడలో బెట్టింగ్ తో పాటు కెసినో నడిపారు అన్న ఆరోపణలు మాజీ మంత్రి కొడాలి నాని పై ఉన్నాయి. దీంతో ఇప్పుడు మసాలా శివ అరెస్టు కావడంతో.. కొడాలి నాని చుట్టూ ఉచ్చు బిగించడం ఖాయమని తెలుస్తోంది. ఇటీవల మాజీ మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. అరెస్టులకు భయపడేది లేదని తేల్చేశారు. మహా ఉంటే ఒక వంద రోజులు జైలులో పెట్టగలరు.. అంతకుమించి ఏమి చేయగలరు అంటూ చాలా తేలిగ్గా మాట్లాడారు. తద్వారా తన అరెస్టు తప్పదని ఆయనే సంకేతాలు పంపించారు. ఇప్పుడు నిజంగానే ఆయన అరెస్టు ఉంటుందన్న ప్రచారం మొదలైంది.

Also Read: గూగుల్ డేటా సెంటర్‌పై జగన్ కి ఎందుకంత కడుపుమంట?

* వివాదాస్పద ముద్ర..
ఏపీలో అత్యంత వివాదాస్పద నేతగా కొడాలి నాని పై( Kodali Nani ) ఒక ముద్ర ఉంది. అందుకు తగ్గట్టుగానే ఆయన నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారు. ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్ పై ఆయన చేసే వ్యాఖ్యలు సామాన్యులకు సైతం ఆగ్రహానికి తెచ్చి పెట్టేవి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై బూతుల ముద్ర రావడానికి కూడా కొడాలి నాని ఒక కారణం. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే కొడాలి నాని అరెస్టు ఉంటుందని అందరి అంచనా. కానీ రెండేళ్లు అవుతున్న కొడాలి నాని అరెస్టు జరగలేదు. ఒక విధంగా టిడిపి శ్రేణుల్లో అసంతృప్తికి ఇదొక కారణం. అయితే ఇప్పుడు బెట్టింగ్ ముఠా ఇచ్చిన సమాచారంతో కొడాలి నాని పై పాత కేసులను తిరగదోడే అవకాశం ఉంది.

* అనారోగ్యం కారణంగా..
మంత్రి నారా లోకేష్( Minister Nara Lokesh) ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెడ్ బుక్ రాస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అప్పట్లో కొడాలి నానికి నేరుగా హెచ్చరికలు పంపారు కూడా. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొడాలి నాని అరెస్టు ఉంటుందని అంత ప్రచారం నడిచింది. కానీ ఇంతలోనే ఆయన అనారోగ్యానికి గురయ్యారు. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. ముంబైలోని ఆసుపత్రిలో ఆయనకు బైపాస్ సర్జరీ జరిగింది. దీంతో హైదరాబాదులోనే విశ్రాంతి తీసుకుంటూ వచ్చారు. ఇటీవల అంబటి రాంబాబు అరెస్టు జరగడంతో ఆయన పరామర్శకు వచ్చారు. తన పాత ధోరణితో మాట్లాడుతూనే జాగ్రత్తపడ్డారు కొడాలి నాని. మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసే వరకు తాము విశ్రమించమని స్పష్టం చేశారు. కేసులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. ఒక విధంగా ప్రభుత్వానికి సవాల్ చేసినంత పని చేశారు. ఈ క్రమంలోనే బెట్టింగ్ కు పాల్పడుతున్న మసాలా శివ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు ఆయన కొడాలి నాని అనుచరుడు అని పోలీసులు నిర్ధారించినట్లు తెలుస్తోంది. అదే జరిగితే గతంలో బెట్టింగులతో పాటు కెసినో నిర్వహించినట్లు కొడాలి నాని పై ఆరోపణలు ఉన్నాయి. దీంతో కొడాలి నాని అరెస్టు ఉంటుందన్న ప్రచారం మొదలైంది. మున్ముందు ఈ కేసుకు సంబంధించిన పరిణామాలు శరవేగంగా మారే పరిస్థితులు మాత్రం కనిపిస్తున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular