https://oktelugu.com/

Day of Happiness: నేడు సంతోష దినోత్సవం.. ఎలా ఏర్పాటయిందంటే?

నేడు సంతోష దినోత్సవం.. ఎలా ఏర్పాటయిందంటే?నవ్వు నాలుగు విధాలుగా చేటు అని అంటారు. కానీ నవ్వు ఆరోగ్యం.. నవ్వడం వల్ల శరీరంలో అనేక కణాలు స్పందిస్తాయి..

Written By: , Updated On : March 20, 2025 / 11:17 AM IST
Happiness-Day

Happiness-Day

Follow us on

Day of Happiness: నేడు సంతోష దినోత్సవం.. ఎలా ఏర్పాటయిందంటే?నవ్వు నాలుగు విధాలుగా చేటు అని అంటారు. కానీ నవ్వు ఆరోగ్యం.. నవ్వడం వల్ల శరీరంలో అనేక కణాలు స్పందిస్తాయి.. ఒక హ్యాపీనెస్ మూమెంట్ ఎంతో ఒత్తిడి నుంచి బయటపడేస్తుంది.. అందువల్ల సాధ్యమైనంతవరకు సంతోషంగా ఉండాలి. అయితే ఇప్పుడున్న కాలంలో చాలా తక్కువ మంది సంతోషంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే డబ్బు సంపాదించాలని కొందరు.. జీవితంలో ఎదగాలని మరికొందరు.. కుటుంబ కుటుంబ సమస్యలతో ఇంకొందరు తీవ్ర ఒత్తిడితో కలిగి ఉన్నారు. అయితే వారంలో ఒకరోజైనా ప్రశాంతంగా ఉండడం వల్ల శరీరానికి ఆరోగ్యంగా ఉంటుంది. అసలు సంతోషమంటే ఏంటిది? ఏ విధంగా సంతోషంగా ఉండాలి? అనేది తెలియజేయడానికి ప్రత్యేకంగా నవ్వుల దినోత్సవం ఏర్పాటు చేశారు. అది ఎలా ఏర్పాటు అయిందంటే?

ప్రపంచవ్యాప్తంగా మార్చి 20వ తేదీన అంతర్జాతీయ సంతోష దినోత్సవం గా జరుపుకుంటున్నారు. 193 ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు సంతోషానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని 2011లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. సంతోషం మానవ ప్రాథమిక లక్ష్యంగా గుర్తించింది. 2012లో మొదటిసారి ఐక్యరాజ్యసమితి సంతోష 30 సదస్సును నిర్వహించారు. 2013 లో దీనిని దినోత్సవం గా ఏర్పాటు చేసి అప్పటినుంచి సంతోష దినోత్సవం గా నిర్వహిస్తున్నారు.

ఒక వ్యక్తి సంతోషంగా ఉంటే ఎన్నో రకాలుగా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే రకరకాల వ్యక్తులు రకరకాల పనులు చేయడం వల్ల సంతోషంగా ఉంటారు. కొందరు ఆధ్యాత్మిక వాతావరణంలో ఉండడం వల్ల సంతోషంగా ఉంటే.. మరికొందరు ఇతరులకు సేవ చేయడం వల్ల సంతోషాన్ని పొందుతారు.. ఇంకొందరు కుటుంబ సభ్యులతో ఉండటం వల్ల హ్యాపీగా ఉంటారు. అయితే వారు ఎలా హ్యాపీగా ఉంటారో ఆ విధంగా ఏర్పాటు చేసుకోవాలి. సంతోషంగా ఉండడం వల్ల గుండె సమస్యలు ఎక్కువగా రాకుండా ఉంటాయి. అలాగే సంతోషంగా ఉండేవారు ఎక్కువకాలం జీవిస్తారని కొన్ని అధ్యయనాలు కూడా తేల్చాయి

అయితే సంతోషంగా ఉండడానికి సరైన ఆహారం తినడం కూడా అవసరమేనని కొందరు ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటిలో పోషక ఆహారం తీసుకోవాలని.. ఇవి తీసుకోవడం వల్ల మానసికంగా దృఢంగా ఉంటారని పేర్కొంటున్నారు. అలాగే కనీస వ్యాయామం చేస్తూ శరీరాన్ని యాక్టివ్ గా ఉంచుకోవాలని చెబుతున్నారు. ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల మెదడు పనితీరు మెరుగ్గా ఉండి సంతోషంగా ఉండగలుగుతారని చెబుతున్నారు. మనసులో నుంచి ఒత్తిడిని తీసివేయడానికి ఇతరులతో ఎక్కువగా మాట్లాడాలని అంటున్నారు. అలాగే ఒక వ్యక్తి తనకు సంబంధించిన విషయాలను ఇతరులతో పంచుకొని ఉండటం వల్ల సంతోషంగా ఉండగలుగుతారని చెబుతున్నాను.

కొందరు తమకు నచ్చిన వ్యక్తులతో ఉండడం వల్ల సంతోషంగా ఉంటారు. అలా ఎవరితోనైతే సంతోషంగా ఉంటారు వారితోనే ఉండడం వల్ల ప్రశాంతంగా ఉంటారు. అలాగని నచ్చని వ్యక్తులకు దూరంగా ఉండటమే మంచిది. అంతేకాకుండా ఎక్కువ సంతోషాన్ని ఇచ్చే పనులు వారానికి ఒకసారైనా చేయాలని అంటున్నారు. ఇలా చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండి మంచి ఆలోచనలు వచ్చే అవకాశం ఉందని తెలుపుతున్నారు. ఇలాంటి విషయాలను అవగాహన కల్పించేందుకే సంతోషమని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.