JC Prabhakar Reddy : రాష్ట్రంలో జెసి ఫ్యామిలీ చేసే రాజకీయం వేరే లెవెల్ లో ఉంటుంది. ఏ పార్టీలో ఉన్నా నిబద్ధతతో పని చేయాలని జెసి సోదరులు చెబుతుంటారు. తాడిపత్రిలో చేసి చూపిస్తారు కూడా. గత ఐదేళ్ల వైసిపి పాలనలో ఎక్కువగా ఇబ్బందులు పడింది జెసి ఫ్యామిలీ. అయినా సరే తెలుగుదేశం పార్టీ జెండాను వీడలేదు. గత మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలో అన్నిచోట్ల ప్రతికూల ఫలితాలు వచ్చినా.. తాడిపత్రిలో మాత్రం జెసి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేశారు. మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు. గత ఐదేళ్లుగా ఎంతో కష్టపడ్డారు. ఇబ్బందులను ఓర్చుకున్నారు. తాడిపత్రి నుండి ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి గెలిచారు. అయితే తనను విభేదించి వైసీపీలో చేరిన టిడిపి వారిని.. తిరిగి పార్టీలో చేర్పించకూడదని ప్రభాకర్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తాడిపత్రిలో ఆసక్తికరమైన ఒక దృశ్యం వెలుగు చూసింది. అందుకు సంబంధించి వివరాలు ఎలా ఉన్నాయి.
తాడిపత్రికి చెందిన లాయర్ శ్రీనివాస్ గతంలో జెసి వర్గీయుడిగా టిడిపిలో కొనసాగారు. అటు తరువాత పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. పార్టీ మారిన వెంటనే జేసీ ప్రభాకర్ రెడ్డి పై హాట్ కామెంట్స్ చేశారు. నీ గురించి నాకు అంతా తెలుసు.. నీ కథ చూస్తా.. అంటూ రెచ్చిపోయారు. వరుసగా ప్రెస్ మీట్ లు పెట్టి జెసి వర్గీయులను టార్గెట్ చేసుకున్నారు. ఇప్పుడు తాడిపత్రి నుంచి జెసి అస్మిత్ రెడ్డి గెలిచేసరికి.. టిడిపిలోకి వచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఉన్నట్టుండి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి దగ్గర ప్రత్యక్షమయ్యారు. అక్కడే బయట చేతులు కట్టుకొని నిలబడ్డారు. ఆ సమయంలో ప్రజాసమస్యలు వింటున్న జెసి ప్రభాకర్ రెడ్డి.. లాయర్ శ్రీనివాసులు చూసి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తనను కాదనుకొని వెళ్లావు కదా.. మళ్లీ ఎందుకు వచ్చావు అని శ్రీనివాసులు జెసి ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు బయటకు వెళ్లి అనరాని మాటలు అన్నావు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెన్నుపోటు పొడిచే వారు ఎవరూ తమకు వద్దన్నారు జెసి ప్రభాకర్ రెడ్డి. ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటూ శ్రీనివాస్ కు సూచించారు. కానీ ఆయన మాత్రం జెసి ప్రభాకర్ రెడ్డి ఎదురుగానే చేతులు కట్టుకొని నిలబడ్డారు.
దీనిపై ప్రభాకర్ రెడ్డి సీరియస్ గా స్పందించారు. నేను ప్రజా సమస్యల వినాలి. నువ్వు ఎంతసేపు ఉన్నా ప్రయోజనం లేదు. వెళ్లిపోవచ్చు అంటూ చేతులు ఊపారు. జెసి ప్రభాకర్ రెడ్డి ఎంత చెప్పినా వినకపోవడంతో అక్కడ ఉన్న కార్యకర్తలను పిలిచి శ్రీనివాస్ ను లాగి ఇంటి బయటకు తీసుకెళ్లి విడిచి పెట్టాలని సూచించారు. ఇద్దరు కార్యకర్తలు న్యాయవాది శ్రీనివాసులు భుజాలపై ఎత్తుకొని ఇంటి బయట వదిలేశారు. శ్రీనివాస్ మాత్రం వెనక్కు తగ్గకుండా ఇంటి ఆవరణలోనే నిలబడ్డారు. కొద్దిసేపటి తర్వాత టిడిపి నేతలు సమావేశంలో పాల్గొనేందుకు జెసి ప్రభాకర్ రెడ్డి రాయల చెరువుకు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గతంలో లాయర్ శ్రీనివాస్ జెసి ప్రభాకర్ రెడ్డి పై నమోదైన కేసులను వాదించేవారు. అటువంటి లాయర్ వైసీపీలో చేరి దారుణ వ్యాఖ్యలు చేశారు. జెసి కుటుంబ సభ్యులపై నమోదైన కేసుల విషయంలో జైలు శిక్ష తప్పదు అంటూ హెచ్చరించేవారు. ఇప్పుడు అదే లాయర్ శ్రీనివాస్ చేతులు జోడించి.. తిరిగి తనను పార్టీలో చేర్పించుకోవాలని జెసి ప్రభాకర్ రెడ్డిని అడుగుతుండడం గమనార్హం. మొత్తానికి అయితే ఇప్పుడు ఇదే అంశం వైరల్ గా మారింది.
అయితే ఈ వీడియోతో జెసి ప్రభాకర్ రెడ్డిని టిడిపి శ్రేణులు పొగడ్తలతో ముంచేత్తుతున్నాయి. గత ఐదేళ్ల వైసిపి పాలనలో ఇబ్బందులు పడ్డామని.. ఇప్పుడు వైసీపీ నేతలు పార్టీలోకి వస్తామంటే ఆహ్వానించకూడదని.. ఇప్పటికే ఈ విషయాన్ని చంద్రబాబు సైతం స్పష్టం చేశారని.. చాలామంది ఈ వీడియోను తిరిగి చంద్రబాబుకు పంపించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఆయనకు ట్యాగ్ చేస్తున్నారు.
జేసీ ప్రేమిస్తే ప్రాణమిస్తారు.. వంచిస్తే ఎత్తి అవతల పడేస్తారు
జేసీ దివాకర్ రెడ్డి తన ఇంట్లో ప్రజల్ని కలుస్తున్న సమయంలో శ్రీనివాసులు అనే మాజీ టీడీపీ నేత ఆయన వద్దకు వచ్చారు. గత ఎన్నికల్లో ఓడిన తర్వాత పెద్దారెడ్డి పంచన చేరి జేసీపైనే విమర్శలు చేశారు ఈ శ్రీనివాసులు.
ఇప్పుడు… pic.twitter.com/Nug4VUnQNi
— Rakesh Tummala #TDP2024 (@tummalarakesh6) July 17, 2024