https://oktelugu.com/

Murari Movie : సరికొత్త వెడ్డింగ్ కార్డ్ తో ‘ మురారి ‘ సినిమా ప్రమోషన్స్ చేస్తున్న అభిమానులు…వైరల్ పిక్..

ఇక ఇలాంటి కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు కూడా కృష్ణ రేంజ్ లోనే భారీ సక్సెస్ లను అందుకుంటూ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్నాడు. మరి ఇలాంటి క్రమంలో మహేష్ బాబు ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో సాఫ్ట్ సినిమాలను చేస్తూ ముందుకు సాగాడు. ఇక ఎప్పుడైతే 'పోకిరి ' సినిమా వచ్చిందో అప్పటినుంచి క్లాసు, మాసు అని తేడా లేకుండా అన్ని జానర్ సినిమాలను టచ్ చేస్తూ వెళ్తున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : July 18, 2024 / 05:00 PM IST
    Follow us on

    Murari Movie :  తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకున్న నటుడు సూపర్ స్టార్ కృష్ణ… ఈయన చేసిన సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకున్నాయి. ఒకప్పుడు 3 షిఫ్ట్ లుగా షూటింగ్ ల్లో పాల్గొంటూ ఒక సంవత్సరం లో దాదాపు 10 నుంచి 15 సినిమాల వరకు రిలీజ్ చేస్తూ ఉండేవాడు… దీని ద్వారా చాలామందికి పని దొరికేది. అలాగే ఎక్కువమంది డైరెక్టర్స్ తమ టాలెంట్ ని ప్రూవ్ చేసుకునే అవకాశం దక్కేది. అలా కృష్ణ లాంటి సూపర్ స్టార్ కేవలం రోజుకి నాలుగు గంటలు మాత్రమే పడుకొని మిగితా సమయం లో సినిమా షూటింగ్ లో పాల్గొనేవాడు.

    ఇక ఇలాంటి కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు కూడా కృష్ణ రేంజ్ లోనే భారీ సక్సెస్ లను అందుకుంటూ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్నాడు. మరి ఇలాంటి క్రమంలో మహేష్ బాబు ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో సాఫ్ట్ సినిమాలను చేస్తూ ముందుకు సాగాడు. ఇక ఎప్పుడైతే ‘పోకిరి ‘ సినిమా వచ్చిందో అప్పటినుంచి క్లాసు, మాసు అని తేడా లేకుండా అన్ని జానర్ సినిమాలను టచ్ చేస్తూ వెళ్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు కెరియర్ లో మొదటి బ్లాక్ బస్టర్ సక్సెస్ ను అందుకున్న సినిమా మాత్రం మురారి అనే చెప్పాలి. కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఒక డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రావడమే కాకుండా యావత్ ఫ్యామిలీ ఆడియన్స్ ను సైతం థియేటర్ కి వచ్చేలా చేసింది. ఇక ఇందులో ఉండే ఎమోషన్స్ ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకుంటాయి…

    ఇక ఇదిలా ఉంటే ఆగస్టు 9వ తేదీన మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని మరోసారి థియేటర్లలో ప్లే చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఆ రోజు మొదటి రెండు ఆటలు ఒక్కడు సినిమాని, మిగిలిన రెండు ఆటలు మురారి సినిమాను ప్లే చేసే ఆలోచనలో ఆ సినిమాల ప్రొడ్యూసర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది… ఇక దానికోసమే కొత్తగా ఒక వెడ్డింగ్ కార్డ్ ని కూడా రెడీ చేసి మురారి సినిమా ప్రమోషన్స్ ను చేపడుతున్నారు. ఇక అందులో భాగంగా ‘వరుడు మురారి’ కి ‘వధువు వసుంధర’ కి ఆగస్టు 9వ తేదీన పెళ్లి చేయబోతున్నాము తప్పకుండా అందరూ హాజరు కాగలరు అంటూ వైవిధ్యభరితంగా ఈ సినిమా ప్రమోషన్స్ ను చేస్తున్నారు. ఇక దానికి సంభందించిన వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. నిజంగా ఈ ప్రమోషన్ ను చూసిన ప్రతి ఒక్కరు చాలా బావుంది అంటూ ప్రశంసలను కురిపిస్తున్నారు.

    ఇక మొత్తానికైతే మురారి సినిమా ఇచ్చిన బూస్టప్ తో మహేష్ బాబు సూపర్ స్టార్ రేంజ్ లో సక్సెస్ అయ్యాడు. మరి అందరు అనుకున్నట్టుగానే ఈ సినిమాను మహేష్ బర్త్ డే రోజు థియేటర్ లోకి తీసుకొస్తున్నారు. కాబట్టి మరోసారి ఈ సినిమా భారీ కలెక్షన్స్ ను రాబట్టి తన సత్తా చాటుతుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఆ రోజు వేసే రెండు ఆటల కోసమే ఈ సినిమాకి అంత ప్రమోషన్స్ చేస్తున్నారు. అదే ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తే ఇంకా ఎంత పబ్లిసిటీ చేస్తారో అంటూ సగటు ప్రేక్షకులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు… ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు కృష్ణవంశీ ఫ్యామిలీ సినిమాలను మాత్రమే తీస్తాడు అనే ఒక మార్క్ అయితే ఉండేది. ఇక మురారి సినిమాతో ఆ ముద్ర మరింత బలపడిందనే చెప్పాలి…