Janasena: పవన్ గెలిచాడు.. ఆ ఇంటికి ఆటో వచ్చింది!

పిఠాపురంలో నిరుపేదలు,సామాన్యులు పవన్ అంటే విపరీతమైన అభిమానం చూపించారు. అందులో ఓ సామాన్య రిక్షా కార్మికుడి కుటుంబం కూడా ఉంది. ఎన్నికల ప్రచార సమయంలో ఓ రిక్షా కార్మికుడి భార్య కామెంట్స్ వైరల్ అయ్యాయి. పిఠాపురంలో పవన్ గెలిస్తే.. మా ఆయన రిక్షా తొక్కి తెచ్చిన సొమ్ముతో ఊరంతా పండగ చేస్తా అంటూ ఆమె ప్రకటించారు.

Written By: Dharma, Updated On : July 9, 2024 12:07 pm

Janasena

Follow us on

Janasena: పిఠాపురం : ఈసారి పవన్ అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఎక్కువమంది భావించారు. అసలు రాజకీయాలతో సంబంధం లేని వారు సైతం పవన్ అవసరాన్ని గుర్తించారు. ఒక ఛాన్స్ ఇవ్వాలని కోరుకున్నారు. పిఠాపురం ప్రజలు కూడా ఇదే రకమైన ఆకాంక్షతో ఏకపక్ష విజయాన్ని కట్టబెట్టారు. 70 వేల మెజారిటీతో గెలిపించారు. విదేశాల్లో స్థిరపడిన యువకులు, చివరకు రిక్షా కార్మికులు సైతం పవన్ కు అండగా నిలిచారు. పవన్ తో తమ భవిష్యత్తు మారుతుందని ఆకాంక్షించారు. ఇంతటి అభిమానాన్ని చూసిన పవన్ సైతం ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలని బలంగా డిసైడ్ అయ్యారు.

* వారి సంకల్పం గొప్పది..
పిఠాపురంలో నిరుపేదలు,సామాన్యులు పవన్ అంటే విపరీతమైన అభిమానం చూపించారు. అందులో ఓ సామాన్య రిక్షా కార్మికుడి కుటుంబం కూడా ఉంది. ఎన్నికల ప్రచార సమయంలో ఓ రిక్షా కార్మికుడి భార్య కామెంట్స్ వైరల్ అయ్యాయి. పిఠాపురంలో పవన్ గెలిస్తే.. మా ఆయన రిక్షా తొక్కి తెచ్చిన సొమ్ముతో ఊరంతా పండగ చేస్తా అంటూ ఆమె ప్రకటించారు. అప్పటికే పిఠాపురం లో ఉన్న పవన్ కు ఈ విషయం తెలిసింది. ప్రజలు ఇంతటి అభిమానం తనపై పెంచుకున్నారా? అంటూ అప్పట్లో ఆయన వ్యాఖ్యానించారు.అయితే ఆ పేద కుటుంబం ఆకాంక్షించినట్టే పవన్ 70 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దీంతో రిక్షా కార్మికుడి భార్య మరియమ్మ తన భర్త రిక్షా తొక్కాగా వచ్చిన సొమ్ముతో స్వీట్లు కొని ఊరంతా పంచిపెట్టారు.

*పవన్ ఆదేశాలతో..
సోషల్ మీడియా రాజ్యమేలుతున్న ఈ తరుణంలో.. ఆ పేద కుటుంబం చేసిన పని పవన్ వరకు వెళ్ళింది. దీనికి ఆయన ఫిదా అయ్యారు. ఆ కుటుంబానికి స్పెషల్ గిఫ్ట్ అందించాలని పార్టీ శ్రేణులకు ఆదేశించారు. అధినేత ఆదేశించినట్టు మాదిరిగానే ఏకంగా ఆటోను కొనుగోలు చేసి అందించారు. దీంతో ఆ కుటుంబం కన్నీటి పర్యంతం అయింది. తమ జీవితాల్లో వెలుగులు వచ్చాయంటూ వారు సంతోషం వ్యక్తం చేయడం విశేషం. గత 20 ఏళ్లుగా ఆ కార్మికుడు రిక్షా తొక్కుతున్నాడు. ఇప్పుడు వారి ఇంటికి ఆటో చేరడంతో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.