https://oktelugu.com/

Bandla Ganesh: పవన్ కళ్యాణ్ కి ఆ విషయం లో కోపం తెప్పించిన బండ్ల గణేష్…ఇప్పుడు వీళ్ళ మధ్య మాటలున్నాయా..?

ముఖ్యంగా గబ్బర్ సింగ్ సినిమా విషయంలో హీరోయిన్ ను మార్చుదాం అనే విషయాన్ని ప్రస్తావిస్తూ శృతిహాసన్ ఐరెన్ లెగ్ అని ఆమెకు ఇంతకు ముందు హిట్స్ లేవని గణేష్ పవన్ కళ్యాణ్ తో చెప్పాడట. దాంతో పవన్ కళ్యాణ్ నీకు మాత్రం ఎన్ని హిట్స్ ఉన్నాయి రా అని గణేష్ ను తిట్టి ఫైనల్ గా ఆ అమ్మాయిని హీరోయిన్ గా తీసుకున్నారనే విషయాన్ని గణేష్ ఒక ఇంటర్వ్యూ లో తెలియజేశాడు.

Written By:
  • Gopi
  • , Updated On : July 9, 2024 / 12:01 PM IST
    Bandla Ganesh

    Bandla Ganesh

    Follow us on

    Bandla Ganesh: సినిమా ఇండస్ట్రీలోకి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినప్పటికీ సొంత టాలెంట్ ఉంటేనే ఇండస్ట్రీలో నిలబడతారనే విషయాన్ని చాలామంది హీరోలు ప్రూవ్ చేశారు. ఇక అందులో పవన్ కళ్యాణ్ ఒకరు. పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలోకి వచ్చే ముందే చిరంజీవి మెగాస్టార్ గా భారీ సక్సెస్ లను అందుకొని ఉన్నారు.

    కాబట్టి ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఒక అద్భుతమైన సక్సెస్ ని సాధించి అప్పటినుంచి ఇప్పటివరకు స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఆయన ఏపీ పాలిటిక్స్ లో కూడా డిప్యూటీ సిఎం గా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్నాడు.ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ గా నిర్మాతగా గుర్తింపు పొందిన బండ్ల గణేష్ మాత్రం పవన్ కళ్యాణ్ కి ఎప్పుడు స్నేహితుడిగా ఉంటూనే ఆయనకు చిరాకు తెప్పించే పనులు చేస్తూ ఉంటారని ఒకనొక సందర్భంలో పవన్ కళ్యాణ్ తెలియజేసాడు.

    ఇక ముఖ్యంగా గబ్బర్ సింగ్ సినిమా విషయంలో హీరోయిన్ ను మార్చుదాం అనే విషయాన్ని ప్రస్తావిస్తూ శృతిహాసన్ ఐరెన్ లెగ్ అని ఆమెకు ఇంతకు ముందు హిట్స్ లేవని గణేష్ పవన్ కళ్యాణ్ తో చెప్పాడట. దాంతో పవన్ కళ్యాణ్ నీకు మాత్రం ఎన్ని హిట్స్ ఉన్నాయి రా అని గణేష్ ను తిట్టి ఫైనల్ గా ఆ అమ్మాయిని హీరోయిన్ గా తీసుకున్నారనే విషయాన్ని గణేష్ ఒక ఇంటర్వ్యూ లో తెలియజేశాడు.

    ఇక ఈ ఒక్క సందర్భంలో మాత్రమే పవన్ కళ్యాణ్ గణేష్ ను తిట్టిన విషయం బయట జనాలకు తెలుసు.. కానీ గణేష్ పవన్ కళ్యాణ్ ను ఇరిటేట్ చేస్తూన్న ప్రతి సందర్భం లో ఆయన గణేష్ ను తిడుతూ ఉంటాడనే విషయం అతనితో సన్నిహితంగా ఉండేవాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. ఇక వీళ్లిద్దరి మధ్య ఇప్పుడు అంత మంచి సత్ సంబంధాలు లేనట్టుగా కనిపిస్తున్నాయి…