Life Style: సినిమాల్లో హీరోలను ముందు అపార్థం చేసుకున్నా ఆ తర్వాత దేవుడిలా వారి కోసమే వచ్చిన వ్యక్తిలా చూస్తుంటారు. ఇక ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు హీరో లేదా హీరోయిన్ ను ఇష్టపడతారు. అలాంటి సీన్ లు చూసినప్పుడు ఒక ఊరు లేదా కొందరు ప్రజలు మనల్ని కూడా అలా ఇష్టపడితే బాగుండు కదా అనిపిస్తుంటుంది. మరి అందరూ ఇష్టపడాలంటే హీరోల మాదిరి ఫైటింగ్ లు, ఆస్తులు పంచిపెట్డడం వంటివి చేయాల్సిన అవసరం లేదు. మరి ఏం చేయాలో తెలుసా? అయితే ఇప్పుడు తెలుసుకోండి.
మన మాటలు, చేష్టలే సమాజంలో పేరును తీసుకొని వస్తాయి అంటున్నారు నిపుణులు. మంచి ప్రవర్తన, నలుగిరి పట్ల దయ, సాయం చేసే గుణం ఉంటే అందరూ ఇష్టపడతారు. మరీ ముఖ్యంగా మీరు కొన్ని విషయాలను జాగ్రత్తగా మలుచుకోవాలి. అవేంటంటే..
ఎదుటి వారు చెప్పే విషయాలను ఏకాగ్రతతో వినాలి. వారు ఫేస్ చేసే ఇబ్బందులను అర్థం చేసుకోవాలి. వారి మనసు నొచ్చుకునే విధంగా మాట్లాడకూడదు. నవ్వాలి. నవ్విస్తూ ఉండాలి. ఎదుటి వారి బాధలను చులకన చేయకూడదు. వీలైనంత వరకు ఎదుటి వారి మీద దయతో ఉండాలి. వారి కష్టాన్ని తీర్చకపోయినా సరే అర్థం చేసుకోవాలి. ధైర్యం చెప్పడం వల్ల ఉపశమనం కలుగుతుంది. మీ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది.
పాజిటివ్ ఆలోచన మీలో ఉంటే అందరు మిమ్మల్ని ఇష్టపడతారు. కానీ నెగటివ్ ఉంటే మీరు ఎవరికి నచ్చరు. అందరిలో చెడు ఉంటుంది. దాన్ని పక్కన పెట్టి మంచిని వెలికితీయాలు. వాగ్దానాలు చేస్తే వాటిని కచ్చితంగా తీర్చాలి. లేదంటే మీ మీద నమ్మకం కూడా పోతుంది. ఎదుటి వారికి రెస్పెక్ట్ ఇవ్వాలి. వారితో కలిసి బయటకు వెళ్లినా, వారితో మాట్లాడిన ఏకవచనంతో మాట్లాడకూడదు. గౌరవంతో మాట్లాడాలి. ఏకవచనం, లెక్కలేని తనం వల్ల మిమ్మల్ని ఎవరు ఇష్టపడరు. టీ వర్క్ చేస్తున్నప్పుడు ఒక గ్రూప్ లో ఉన్నప్పుడు మీరు ఎఫెక్టివ్ గా అందరికీ అర్థం అయ్యేలా మాట్లాడాలి. వాడు ఏం చెప్తాడో అర్థమే కాదురా అనే కామెంట్ ఇచ్చే విధంగా ఉండకూడదు.
మీ మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టేలా ఎప్పుడు బీహేవ్ చేయకండి. నమ్మకం పోతే కలగడం కష్టమే. నమ్మకంగా ఉంటే వారికి మీ మీద గౌరవం కూడా పెరుగుతుంది. పనిలో, ఇంట్లో ఎక్కడా ఉన్నా సరే నవ్వుతూ నవ్విస్తూ ఉంటే మీరు ఎప్పుడు పక్కనే ఉండాలని కోరుకుంటారు. వారి మూడ్ బాగలేకపోయినా సరే మీ దగ్గర ఉంటే నవ్వు ఉంటుందని.. మూడ్ ఛేంజ్ అవుతుందని నమ్ముతారు. వారి నవ్వుకోసం మీరు నవ్వుల పాలు అయ్యే విధంగా నవ్వించవద్దు. చులకన అవుతారు జాగ్రత్త.