Jamili elections : దేశంలో జమిలి ఎన్నికలు( jameli elections ) జరుగుతాయా? 2027 ద్వితీయార్థంలో ఎన్నికలకు కేంద్రం సిద్ధపడుతోందా? ఐదేళ్ల పాటు మిత్రుల సాయంతో ప్రభుత్వాన్ని నడపడం మోడీకి ఇష్టం లేదా? ఆపరేషన్ సింధూర్ తో దేశవ్యాప్తంగా బిజెపి బలపడిందని ఆ పార్టీ భావిస్తోందా? అందుకే జమిలికి సిద్ధమవుతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. అదే సమయంలో ఏపీలో అమరావతి రాజధాని నిర్మాణం, సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున చేపడుతుండడంతో.. భాగస్వామ్య పక్షంగా టిడిపికి జమిలి గురించి స్పష్టత వచ్చిందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. బిజెపి వైఖరి చూస్తుంటే ముందస్తు ఎన్నికలు ఖాయమని తేలిపోతోంది. పాకిస్తాన్తో యుద్ధ వాతావరణం నేపథ్యంలో.. ప్రధాని మోడీకి వచ్చిన ఇమేజ్ తో ఏపీలో మరోసారి గట్టెక్క వచ్చని చంద్రబాబు ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. చంద్రబాబు సైతం జమిలికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
Also Read : మహానాడుకు జూనియర్ ఎన్టీఆర్.. తెర వెనుక జరిగింది అదే!
* దశాబ్ద కాలంగా..
జమిలి ఎన్నికల మాట ఇప్పటిది కాదు. 2014 నుంచి వినిపిస్తూనే ఉంది. 2014- 2019 మధ్య సాధ్యం కాలేదు. 2019 నుంచి 2024 మధ్య కూడా వీలు కాలేదు. ప్రధాని మోదీ( Prime Minister Narendra Modi) ముచ్చటగా మూడోసారి పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే ఈసారి పక్కా వ్యూహంతో బిజెపి జమిలికి సిద్ధపడుతోందని తెలుస్తోంది. దానికి కారణం లేకపోలేదు. ఆపరేషన్ సింధూర్ సాక్షిగా బలమైన బీజం పడిందని అంటున్నారు. ఈ పరిణామంతో దేశవ్యాప్తంగా మోడీ నాయకత్వం పై ప్రజల్లో నమ్మకం పెరిగింది. అందుకే ఇదే వేవ్ తో ముందస్తు ఎన్నికలకు వెళితే బిజెపి ఒక ప్రభావవంతమైన శక్తిగా దేశంలో నిలుస్తుందని ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. పైగా ప్రస్తుతం మిత్రుల సహకారంతో నడుస్తోంది కేంద్ర ప్రభుత్వం. అలా నడవడం మోడీకి ఇష్టం లేదు. ఇప్పుడు గానీ ఎన్నికలకు వెళ్తే బిజెపి సొంతంగానే మ్యాజిక్ మార్క్ దాటడం ఖాయం.
* దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీలు..
మరోవైపు పాకిస్తాన్ తో( Pakistan) యుద్ధం నేపథ్యంలో భారత్ పై చేయి సాధించింది. దానిని రాజకీయంగా సొమ్ము చేసుకోవడానికి దేశమంతా తిరంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. వీటిని రాష్ట్రస్థాయిలో బిజెపి ముఖ్యమంత్రుల నుంచి జిల్లా స్థాయిలో మంత్రులు,నియోజకవర్గాల స్థాయిలో ఎమ్మెల్యేలు .. ఇంకా దిగువ స్థాయిలో సైతం బిజెపి నాయకులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 13న తిరంగా ర్యాలీలు మొదలయ్యాయి. ఈనెల 23 దాకా అంటే 11 రోజులపాటు దేశవ్యాప్తంగా నిర్వహిస్తుండడం వెనుక రాజకీయ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బిజెపికి అనుకూల వాతావరణం ఉంది. దీంతో 2026లో జనాభా గణన చేపట్టి.. 2027 ద్వితీయార్థంలో జమిలి ఎన్నికలకు వెళ్లాలని ప్రధాని నరేంద్ర మోడీ బలంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
* చంద్రబాబు దూకుడు..
అయితే ఇప్పుడు బిజెపికి నమ్మదగిన మిత్రుడిగా చంద్రబాబు( CM Chandrababu) ఉన్నారు. అందుకే చంద్రబాబుకు సైతం ఈ విషయం చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే చంద్రబాబు అమరావతి రాజధానితో పాటు అభివృద్ధి పనులను శరవేగంగా చేయిస్తున్నారు. సంక్షేమ పథకాల అమలుపై దృష్టి పెట్టారు. సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం మోడీ వేవ్ తో ముందుకెళ్లి మరోసారి ఘన విజయం సాధించాలని వ్యూహాలు రూపొందిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.