Trump : తెల్లటి వస్త్రాలు ధరించి.. జుట్టు విరబోసుకుని స్వాగతం పలికిన యువతులను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. కాసేపు అక్కడ నిలబడి.. అసలు వాళ్లు యువతులేనా? లేక దయ్యాలా? అన్నట్టుగా చూశాడు.. వాస్తవానికి యూఏఈ సంప్రదాయం ప్రకారం ఇలాంటి స్వాగతం పలుకుతారట.. యువతులు జుట్టు విరబోసుకొని సాంప్రదాయ సంగీతానికి అనుగుణంగా తలలు ఊపడం అక్కడ సర్వసాధారణ మట.. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో తెగ సందడి చేస్తోంది. అయితే ఆ యువతులు అలా నృత్యం చేయడాన్ని చాలామంది ఆశ్చర్యంగా చూస్తున్నారు. అంతేకాదు దాని గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
Also Read : ఈ గల్ఫ్ దేశాల విలాసం ముందు అమెరికా వేేస్ట్ అట.. నివ్వెరపోయిన ట్రంప్
దాని పేరు అల్ – అయ్యాలా
ట్రంప్ కు ఘన స్వాగతం పలకడానికి యూఏఈ ప్రభుత్వం అందమైన యువతులను రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. వారు సంప్రదాయ వాయిద్యాలకు తగ్గట్టుగా నృత్యాలు చేశారు. కాకపోతే జుట్టు విరబోసుకుని తలను అటు ఇటు తిప్పుతూ స్వాగతం పలికారు. తెల్లటి దుస్తుల్లో వారు కనిపించారు. వారిని చూస్తుంటే వెనకటికి విఠలాచార్య సినిమాలోని జగన్మోహిని పాత్రధారులుగా దర్శనమిచ్చారు.. అయితే ఈ నృత్యాన్ని అల్ అయ్యాలా అని పిలుస్తారట.. యునెస్కో నివేదిక ప్రకారం అల్ అయ్యలా అనేది యూఏఈ, ఒమన్ ప్రాంతాలలో ఫేమస్ ట్రెడిషనల్ డ్యాన్స్.. సంప్రదాయ దుస్తులు ధరించిన యువతులు.. వారి పొడవైన జుట్టును విరబోసుకుంటారు. ఆ తర్వాత సంప్రదాయ సంగీతానికి తగ్గట్టుగా తమ తలలను ఊపుతుంటారు. యూఏఈ, ఓమన్ దేశాలలో వివాహాలు, ఇతర వేడుకల సమయంలో అల్ – అయ్యాలా నృత్యాలను ఎక్కువగా చేస్తుంటారు. ఈ నృత్యంలో వయసుకు ప్రాధాన్యం ఉండదు. లింగం తో సంబంధం ఉండదు. సామాజిక బేధానికి ఆస్కారం ఉండదు. మనుషులు మొత్తం ఒకటే అనే సంకేతాన్ని ఈ నృత్యం ద్వారా ప్రదర్శిస్తారు.
చాలా సంవత్సరాల చరిత్ర
అల్ అయ్యాలా నృత్యానికి చాలా సంవత్సరాల చరిత్ర ఉంది. గతంలో యూఏఈ, ఓమన్ దేశాలలో సామాజిక బేధాలు తీవ్రంగా ఉండేవి. లింగ వివక్ష కూడా అధికంగా ఉండేది. అందువల్లే దీనిని రూపుమాపడానికి అక్కడి పాలకులు సరికొత్త విధానాన్ని తెరపైకి తీసుకువచ్చారు. అలా వారు తెచ్చిన పేరే అల్ – అయ్యాలా.. ఈ నృత్యం ద్వారా బాలికలు తమ ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శిస్తుంటారు. పురుషులు తమ ఆత్మ స్థైర్యాన్ని ప్రదర్శిస్తుంటారు. తమ సంస్కృతిని ప్రపంచం మొత్తం గుర్తించే విధంగా వీరు ఇలాంటి నృత్యాలు చేస్తుంటారు. తమ సంస్కృతిని సంప్రదాయాన్ని ప్రపంచం మొత్తం గుర్తించాలని యూఏఈ, ఒమన్ దేశాల వారు పేర్కొంటుంటారు. అందువల్లే యునెస్కో దీనిని ప్రముఖంగా గుర్తించింది. ప్రపంచ వారసత్వ నృత్యం గా పేర్కొంది.
.@POTUS bids President Mohammed bin Zayed Al Nahyan farewell after receiving a royal welcome at Zayed International Airport in Abu Dhabi pic.twitter.com/NnIf6MYp44
— Rapid Response 47 (@RapidResponse47) May 15, 2025