Prabhala Theerthamరాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు( Pongal festivals ) కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఉభయగోదావరి తో పాటు కోస్తాంధ్రలో సందడి వాతావరణం ఉంది. భోగితోపాటు సంక్రాంతి పర్వదినాలు ముగిసాయి. ఈరోజు కనుమ పండుగ జరగనుంది. ముఖ్యంగా ప్రభల తీర్థాలు ప్రారంభం కానున్నాయి. వీటికి గోదావరి జిల్లాలో ప్రత్యేక గుర్తింపు ఉంది. కోనసీమ వ్యాప్తంగా మూడు రోజులపాటు జరిగే సంక్రాంతి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రభల తీర్థం ఎంతో అట్టహాసంగా, ఆర్భాటంగా జరుపుతారు. ఈ ప్రభల తీర్థాలకు సుదీర్ఘ నేపథ్యం ఉంది. శతాబ్దాలుగా కొనసాగుతూ వస్తోంది ఈ ఆచారం.
* మొసలిపల్లిలో
ప్రధానంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ ( Dr BR Ambedkar Kona Sima) జిల్లా అంబాజీపేట మండలం మొసలి పల్లెలో ఘనంగా జరుపుతారు ప్రభల తీర్థం. అక్కడ జగ్గన్న తోటలో జరిగే ప్రభల తీర్థ వేడుకలకు జాతీయస్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ తీర్థానికి తరలివచ్చే ప్రభలు ఎగువ కౌశిక దాటి వస్తున్న తీరు చూసి భక్తులు ఒక్కసారిగా గగుర్పాటుకు గురవుతారు. మకర సంక్రాంతి తర్వాత వచ్చే ఉత్తరాయన కాలంలో ప్రభలను ఊరి పొలిమేరలు దాటిస్తే మంచిదని ప్రజల ప్రగాఢ నమ్మకం.
* సుదీర్ఘ చరిత్ర
ఈ ప్రభల తీర్థాలకు( prabala tirtham ) సుదీర్ఘ చరిత్ర ఉంది. ప్రాచీన కాలంలో మొట్టమొదటిసారిగా ఈ జగ్గన్న తోటలోని 11 గ్రామాల రుద్రులు సమావేశమయ్యారని స్థల పురాణం చెబుతోంది. ఈ తోటలో ఏ విధమైన గుడి కానీ.. గోపురం కానీ ఉండవు. ఇది పూర్తిగా కొబ్బరి తోట. ఏకాదశరుద్రులు సంవత్సరానికి ఒకసారి ఇక్కడ సమావేశం అవడంతో ఈ తోట విశేష ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది ఏకాదశ రుద్రుల కొలువుగా భావిస్తారు. లోక కళ్యాణార్థం ఈ 11 గ్రామాల శివుళ్ళు జగ్గన్న తోటలో సమావేశం అవుతారని.. ఈ లోక విషయాలను చర్చిస్తారన్నది భక్తుల ప్రగాఢ నమ్మకం.
* 400 సంవత్సరాలుగా
గత నాలుగు వందల సంవత్సరాలుగా ఈ ప్రభల తీర్థాలు( prabala) కొనసాగుతున్నాయి. ప్రత్యేక పరిస్థితుల్లో సైతం ఎప్పుడు నిలిచిపోయే పరిస్థితి ఉండదు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. భూమి తలకిందులైనా ఈ రుద్రులను ఒకచోట చేర్చుతారు. సంస్థానాదిసులైన శ్రీ రాజా వాత్సవాయి జగన్నాథ మహారాజుకు చెందిన ఈ తోట.. జగ్గన్న తోటగా స్థిరపడింది.
* ప్రతి దృశ్యం అద్భుతం
జగ్గన్న తోట( Jaganna Thota) ముసలి పల్లి గ్రామంలో ఉంది. కనుమ రోజు మిగతా గ్రామ రుద్రులకు ఆతిథ్యం ఇస్తారు ముసలిపల్లి మధుమానంత భోగేశ్వరుడు. ఈ రుద్రుడు అన్ని ప్రబల కంటే ముందు తోటకు చేరుకుని.. అందరూ రుద్రులు తిరిగి వెళ్ళిన తర్వాత వెళ్లడం ఆనవాయితీ. ఈ తోటలోకి ప్రభలు రావాలంటే మధ్యలో కాలువ ఉంటుంది. ఈ కాలువలు మామూలుగానే నడవలేము. అలాంటిది 30 మంది మోస్తే కానీ లేవని ప్రభ ఆ కాలువలోంచి తోటలోకి తీసుకువచ్చే దృశ్యాలు ఒళ్ళు గగుర్పాటుకు గురిచేస్తాయి. ఆ కాలువలోకి వచ్చే ముందు ఒక వరి చేను ని ప్రభలు దాటవలసి ఉంటుంది. ఆ చేనును తొక్కుతూ.. వచ్చిన రైతులు బాధపడరు. సాక్షాత్ పరమశివుడే తమ పంటలను తొక్కినట్లు భావిస్తారు.