Jagan Suggestion on Amaravati : అమరావతి రాజధాని( Amravati capital ) నిర్మాణం విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరి మారలేదా? ప్రజలు తిరస్కరించినా జగన్ అర్థం చేసుకోవడం లేదా? ఆ పార్టీ మరోసారి అబాసుపాలు కావడం ఖాయమా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. విభజన తర్వాత తొలిసారిగా తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. అందరి ఏకాభిప్రాయంతో చంద్రబాబు సర్కార్ అమరావతి రాజధానిని ఎంపిక చేసింది. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అంశాన్ని తెరపైకి తెచ్చారు. అమరావతి రైతుల ఉద్యమాన్ని తేలిగ్గా తీసుకున్నారు. కానీ 2024 ఎన్నికల్లో అమరావతి రాజధాని అంశం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతికూలత చూపింది. కానీ దానిని గుణపాఠంగా తీసుకోలేకపోయారు జగన్మోహన్ రెడ్డి. తాజాగా కూడా అమరావతికి వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు చేశారు.
* టెండర్లపై గోల
ఏపీలో కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చింది. అమరావతికి కొత్త కళ వచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ ఈనెల రెండున అమరావతి రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దాదాపు భారీ నిర్మాణాలకు సంబంధించి టెండర్లు పూర్తయ్యాయి. పనులు ప్రారంభించేందుకు సంబంధిత కాంట్రాక్టు సంస్థలు అన్ని రకాల కసరత్తులు పూర్తి చేశాయి. ఇటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. అమరావతి టెండర్లపై వ్యతిరేకంగా మాట్లాడారు. భారీగా దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. అయితే గత ఐదేళ్లు ఏం చేశారు అని జగన్మోహన్ రెడ్డికి తిరిగి ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
Also Read : మోడీ–జగన్ సంబంధానికి బీటలు.. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో సరికొత్త చర్చ
* భవనాలు కట్టిస్తే సరిపోతాయి..
మరోవైపు రాజధానికి ( capital )ఓ 500 ఎకరాలు అయితే సరిపోతాయని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. గుంటూరు- విజయవాడ మధ్య ఓ 500 ఎకరాల్లో భవనాలు కట్టేస్తే సరిపోతుందని.. అమరావతి రాజధాని అంటూ హంగామా చేస్తున్నారని జగన్ తాజాగా విమర్శలు చేయడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని తెలియజేస్తోంది. 2017 లో సైతం ఇటువంటి విమర్శలు చేశారు. 2024లో దారుణంగా దెబ్బతిన్నారు. అయినా సరే 2025లో అటువంటి వ్యాఖ్యానాలు చేస్తుండడం విశేషం.
* ఆ విషయంలో స్పష్టత..
తాము అధికారంలోకి వచ్చిన అమరావతి రాజధాని విషయంలో తమ స్టాండ్ మారదని వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ నేతలు సంకేతాలు ఇస్తున్నారు. ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సైతం ఇదేవిధంగా మాట్లాడారు. ఎప్పటికీ అమరావతి రాజధానిని రెఫరండం గా తీసుకొని ఎన్నికలు జరిగాయి. ప్రజలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. అయినా ఆ పార్టీ అధినేతతో పాటు శ్రేణుల్లో ఎటువంటి మార్పు రాలేదు. 500 ఎకరాల్లో రాజధాని నిర్మాణం జరిపించవచ్చని తాజాగా జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజెన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. వీరు మారరు గాక మారరు అంటూ నిందిస్తున్న వారు ఎక్కువగా ఉన్నారు.