Raj Kasireddy Liquor Case: ఏపీ మద్యం కేసులో రాజ్ కెసిరెడ్డికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. కెసిరెడ్డి ఉపేంద్రరెడ్డి, రాజ్ కెసిరెడ్డి పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇప్పటికే కస్టడీలో ఉన్నందున బెయిల్ కోసం సంబంధిత కోర్టును ఆశ్రయించాలని సూచించింది. తన కుమారుడి అరెస్ట్ సమయంలో నిబంధనలు పాటించలేదని ఉపేంద్రరెడ్డి పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.