Homeఆంధ్రప్రదేశ్‌Viral Video : దాన వీర శూర కర్ణ.. చంద్రబాబుపై జగన్ సెటైర్లు మామూలుగా లేవుగా.....

Viral Video : దాన వీర శూర కర్ణ.. చంద్రబాబుపై జగన్ సెటైర్లు మామూలుగా లేవుగా.. వైరల్ వీడియో

Viral Video :  వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) తీరు మార్చుకున్నారు. తన హావభావాలను కూడా మార్చేశారు. ఏదైనా చెప్పాలంటే ఇప్పుడు సెటైరికల్ గా చెబుతున్నారు. నిన్న రోబో మాదిరిగా.. 1.0, 2.0 గురించి ప్రస్తావించిన ఆయన.. ఈరోజు మాత్రం చంద్రబాబును ఉతికి ఆరేశారు. దానవీరశూరకర్ణ డైలాగులు గుర్తుచేస్తూ.. అవార్డు ఇవ్వాల్సింది నందమూరి తారక రామారావుకు కాదని.. ఆ అవార్డు ఏదో చంద్రబాబుకు ఇవ్వాలని సూచించారు జగన్. నటనలో చంద్రబాబు ఆరితేరిపోయారని కూడా చెప్పుకొచ్చారు. చంద్రబాబుపై పంచుల మీద పంచులు వేస్తూ.. తాను చెప్పాల్సింది సింపుల్ గా చెప్పేశారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

* చంద్రబాబు మాటలను గుర్తు చేస్తూ..
ఎన్నికల్లో అలవి కాని హామీలు ఇచ్చారు చంద్రబాబు( Chandrababu). రెట్టింపు సంక్షేమాన్ని అందిస్తామని చెప్పుకొచ్చారు. సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించారు. అవసరమైతే సంపద సృష్టించి మరి సంక్షేమ ఫలాలు అందిస్తామని చెప్పుకొచ్చారు. కానీ 8 నెలలు అవుతున్న ఇంతవరకు సంక్షేమ పథకాల అమలు లేదు. అదే విషయాన్ని గుర్తు చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి. హామీలు ఇచ్చింది చంద్రబాబే. అదే హామీలను తుంగలో తొక్కింది చంద్రబాబే. ఎందుకంటే రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగా లేదంటారు. రాష్ట్రంలో విధ్వంసాన్ని సృష్టించారంటారు. మరో పదేళ్లపాటు వెనుకబడిందంటారు. ఇలా లేని పోనీ మాటలతో, తన నటనతో ప్రజలను మోసం చేయడం చంద్రబాబుకు అలవాటైన విద్య అని చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి.

* సెటైరికల్ కామెంట్స్
”అయితే తాను సంక్షేమ పథకాలు( welfare schemes) ఎందుకు అమలు చేయలేదు సూటిగా చెప్పరట చంద్రబాబు. దానిని కూడా జగన్మోహన్ రెడ్డికి ఆపాదిస్తారు. దానిని కూడా ఒక వ్యూహం ప్రకారం వివరించే ప్రయత్నం చేస్తారు. చేతుల ఊపుతూ, హావభావాలతో రెట్టికట్టిస్తారు. దానవీరశూరకర్ణలో నందమూరి తారక రామారావు గారిని మరిపిస్తారు చంద్రబాబు. ఏదైనా అవార్డు ఇవ్వాలంటే ఎన్టీఆర్కు కాదు. చంద్రబాబు గారికి ఇవ్వాలి ”.. అంటూ చమత్కరించారు జగన్మోహన్ రెడ్డి. ఆయన ప్రసంగం అంత సెటైరికల్ గానే సాగడం విశేషం.

* మారిన మనిషిగా జగన్
తాను మారిన మనిషినని జగన్మోహన్ రెడ్డి ( Jagan Mohan Reddy)ఇప్పటికే చెప్పుకున్నారు. 2029 ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయమని తేల్చి చెప్పారు. మరో 30 ఏళ్ల పాటు అధికారంలో ఉంటామని కూడా ధీమా వ్యక్తం చేశారు. జగన్ 1.0 ప్రజల కోసమని.. జగన్ 2.0 కార్యకర్తల కోసమేనని సినిమా డైలాగులు చెబుతూ ఉత్తేజపరిచారు. కానీ ఈరోజు అదే దూకుడుతో చంద్రబాబుపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. సినిమా డైలాగులతో.. ఎక్కడ సుత్తి లేకుండా.. స్పష్టంగా తాను అనుకున్నది చెప్పగలిగారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular