Jagan Palnadu Updates: ఏపీలో( Andhra Pradesh) రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి దూకుడు పెంచారు. వివిధ పనుల నిమిత్తం ఆయన ప్రజల్లోకి వస్తున్నారు. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల పరామర్శకు ఆసక్తి చూపుతున్నారు. కూటమి ప్రభుత్వ బాధితుల పరామర్శకు వెళ్తున్నారు. అయితే జగన్ పర్యటనకు జనం పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోంది. విధ్వంసకర ఘటనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పోలీస్ శాఖ అప్రమత్తం అయ్యింది. ఈ నేపథ్యంలో ఈరోజు పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో జగన్ పర్యటించనున్నారు. పోలీసుల భారీ ఆంక్షలు నడుమ జగన్ పర్యటన కొనసాగనుంది.
పల్నాడు కి బయలుదేరిన మాజీ సీఎం @ysjagan ✊#YSJaganInPalnadu #YSJagan pic.twitter.com/VS8FJbaeM2
— మా నమ్మకం నువ్వే జగన్ (@2024_YSRCParty) June 18, 2025
వరుస ఘటనల నేపథ్యంలో..
మొన్న ఆ మధ్యన అనంతపురం జిల్లాలో( Ananthapuram district) జగన్ పర్యటన సమయంలో భద్రతా వైఫల్యం అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. జగన్ హెలికాప్టర్ పై రాగా.. ఒక్కసారిగా జనం హెలిప్యాడ్ వద్దకు దూసుకొచ్చారు. ఈ క్రమంలో హెలికాప్టర్ డోర్ ఊడిపోయింది. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా జనం ప్రాణాలకు ముప్పు తప్పదని తెలుస్తోంది. దీని వెనుక కుట్ర కోణం ఉందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించిన నేపథ్యంలో ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. దీంతో ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టింది. అటు తర్వాత ఇటీవల జగన్ జిల్లాల పర్యటన సమయంలో కూడా విధ్వంసకర పరిస్థితులు తలెత్తాయి. రాళ్లదాడి కూడా జరిగింది. అందుకే జగన్ పర్యటనల విషయంలో పోలీస్ శాఖ జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇప్పటికే పల్నాడు ఎస్పి స్పష్టమైన సూచనలు చేశారు. వంద మందితో వచ్చి విగ్రహ ఆవిష్కరణ చేసుకుంటే అనుమతిస్తామని సూచించారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా జన సమీకరణ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Tommoro Jagan Anna palnadu Tour shadule pic.twitter.com/Zkyfbj5fIG
— ప్రజా దర్బార్ (@2029krisha) June 17, 2025
వైసీపీ నేత విగ్రహ ఆవిష్కరణకు
గత ఏడాది ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత.. రెంటపాళ్లకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొర్లకుంట నాగమల్లేశ్వరరావు( nagamalleswara ) పోలీసులు హింసించడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఇది కూటమి చేసిన హత్యగా ఆరోపిస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఏడాది పూర్తయిన సందర్భంగా రెంటపాళ్లలో నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు జగన్మోహన్ రెడ్డి ఆ గ్రామానికి రానున్నారు. అయితే గత అనుభవాల దృష్ట్యా పోలీస్ శాఖ ఆంక్షలు విధించింది. జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ తో పాటు మూడు వాహనాలు, వంద మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తుండడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. అనుమతికి మించి పాల్గొంటే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు. దారి పొడవునా 25 చెక్పోస్ట్ లను ఏర్పాటు చేశారు. దీంతో ఈరోజు పల్నాడు లో ఏం జరుగుతుందో అని సర్వత్రా చర్చ నడుస్తోంది.