OG Telugu States Earnings: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘ఓజీ'(They Call Him OG) చిత్రం మరో వంద రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా నుండి ఇప్పటి వరకు కేవలం ఒక్క గ్లింప్స్ వీడియో మాత్రమే విడుదలైంది. ఆ గ్లింప్స్ సృష్టించిన విస్ఫోటనం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కేవలం ఒకే ఒక్క గ్లింప్స్ తో ఒక సినిమా పై ఈ రేంజ్ అంచనాలు ఏర్పడుతాయా? , పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ కి అలాంటి గ్లింప్స్ పడితే అంతేగా మరి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సెప్టెంబర్ 25 న విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ అన్ని ప్రాంతాలకు క్లోజ్ అయ్యాయి. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం కేవలం కోస్తాంధ్ర థియేట్రికల్ రైట్స్ దాదాపుగా 81 కోట్ల రూపాయిల వరకు ఉంటుందట.
కేవలం #RRR, పుష్ప 2 చిత్రాలకు మినహా ఏ సినిమాకు కూడా ఇప్పటి వరకు ఈ స్థాయి థియేట్రికల్ బిజినెస్ జరగలేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. అదే విధంగా సీడెడ్ ప్రాంతానికి 25 కోట్ల రూపాయిల బిజినెస్ జరగగా, నైజాం ప్రాంతానికి 90 కోట్ల రూపాయిల బిజినెస్ అడ్వాన్స్ బేసిస్ మీద జరిగిందని చెప్తున్నారు. ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 196 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట. ఇది సాధారణమైన విషయం కాదు. ఎందుకంటే రాజమౌళి #RRR చిత్రం తెలుగు రాష్ట్రాలకు 192 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసింది. అదే విధంగా ‘పుష్ప 2’ చిత్రం 220 కోట్ల రూపాయిల బిజినెస్ ని అప్పట్లో పూర్తి చేసుకుంది. ‘పుష్ప 2’ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక బిజినెస్ ని జరుపుకున్న చిత్రమిదే.
Also Read: A Star Hero In OG Movie: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో కనిపించనున్న స్టార్ హీరో…
నైజాం ప్రాంతం లో మాత్రం ఆల్ టైం రికార్డుగా చెప్తున్నారు. ‘పుష్ప 2’ అంటే సీక్వెల్ క్రేజ్ కాబట్టి ఆ రేంజ్ బిజినెస్ జరిగింది, కానీ ‘ఓజీ’ చిత్రానికి కేవలం పవన్ కళ్యాణ్ క్రేజ్ కారణంగానే ఆ స్థాయి బిజినెస్ జరిగిందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. కేవలం ఒక్క గ్లింప్స్ వీడియో సృష్టించిన భీభత్సం ఇది. రాబోయే రోజుల్లో ఈ సినిమా నుండి ఎన్నో అద్భుతమైన కంటెంట్స్ బయటకి రాబోతున్నాయి. వీటి ద్వారా ఈ చిత్రానికి ఇంకెంత క్రేజ్ రాబోతుందో ఊహించుకోవడానికి కూడా కష్టమే. ట్రైలర్ వచ్చే వరకు కూడా ఆగనవసరం లేదు, పవన్ కళ్యాణ్ చొక్కా లేకుండా ఉండే ఒక సన్నివేశం ఉంటుంది. ఆ సన్నివేశానికి సంబంధించిన పోస్టర్ ని ఒక్కటి విడుదల చేస్తే సినిమా పై ఇప్పుడున్న అంచనాలను వంద రేట్లు ఎక్కువ చేస్తుంది. వాస్తవానికి ఈ నెల నుండే ప్రొమోషన్స్ మొదలు పెట్టాలి. కానీ ‘హరి హర వీరమల్లు’ కోసం తాత్కాలికంగా ఆపారు.