Jagan New Look: జగన్‌ కొత్తలుక్‌.. మారిన డ్రెసింగ్‌ స్టైల్‌.. వైరల్‌ అవుతున్న ఫొటో!

సీఎంగా ఉన్న సమయంలో, అంతకు ముందు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కూడా సీఎం జగన్‌ ఫార్మల్‌ డ్రెస్సింగ్‌లో కనిపించేవారు.

Written By: Raj Shekar, Updated On : July 2, 2024 12:49 pm

Jagan New Look

Follow us on

Jagan New Look: ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. వారం రోజుల క్రితం బెంగళూరు వెళ్లిన ఆయన అక్కడ తన నివాసంలో ఉంటున్నారు. తనను కలిసేందుకు వచ్చిన అభిమానులను కలుస్తున్నారు. వారితో ఫొటోలు దిగుతున్నారు. ఈ సందర్భంగా ఆయన కొత్త లుక్‌లో కనిపించారు. దీనికి సబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

పైజామాలో జగన్‌..
సీఎంగా ఉన్న సమయంలో, అంతకు ముందు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో కూడా సీఎం జగన్‌ ఫార్మల్‌ డ్రెస్సింగ్‌లో కనిపించేవారు. ఇక సీఎం అయ్యాక పండుగల వేళల్లో తిరుమల వెళ్లినప్పుడు, శారదా పీఠానికి వెళ్లినప్పుడు సంప్రదాయ పంచకట్టులో కనిపించే వారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత జగన్‌ తన సొంత నియోజకవర్గం పులివెందులకు వెళ్లారు. అక్కడ ఐదు రోజులపాటు గడిపారు. ఓటమిపై సమీక్ష చేశారు. అనంతరం అటునుంచి అటే బెంగళూరు వెళ్లారు. అక్కడి ఇంట్లో వారం రోజులుగా ఉంటున్నారు. ఈ సందర్భంగా ఆయన పైజామా డ్రెస్‌లో కనిపించారు. తన ఇంటికి వచ్చేవారిని కలుస్తున్నారు. వారితో ఫొటోలు దిగుతున్నారు.

నెట్టింట్లో వైరల్‌…
జగన్‌ కొత్త లుక్‌ ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అధికారంలో ఉన్న సమయంలో ఒకసారి కళ్ల జోడులో న్యూ లుక్‌లో కనిపించారు. తర్వాత మళ్లీ ఇప్పుడే ఇళా కొత్తగా కనిపిస్తున్నారు. నెట్టింట్లో వైరల్‌ అవుతున్న జగన్‌ న్యూ లుక్‌ ఫొటోలపై నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. కొందరు బాగుందని కామెంట్‌ చేస్తుంటే.. అధికారం పోవడంతో డ్రెస్సింగ్‌ స్టైల్‌ మారిందని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు.