https://oktelugu.com/

Anasuya: మాట తప్పిన అనసూయ మళ్ళీ మొదలెట్టింది… వాళ్లకు పండగే!

Anasuya: అనసూయకు ముందు తెలుగులో శ్రుతి మించి గ్లామర్ షో చేసింది లేదు. అనసూయ పొట్టి బట్టలు పెద్ద చర్చకు దారి తీశాయి. అనేక విమర్శలు వెల్లువెత్తాయి.

Written By:
  • S Reddy
  • , Updated On : July 2, 2024 / 01:54 PM IST

    Anasuya Bharadwaj breaks her promise doing TRP stunts

    Follow us on

    Anasuya: ఆ విషయంలో మాట తప్పింది అనసూయ భరద్వాజ్. జీవితంలో చేయనన్న పని చేసింది. ఇప్పుడిదే హాట్ టాపిక్ అవుతుంది. అనసూయ భరద్వాజ్ ఒకప్పటి జబర్దస్త్ యాంకర్. 2013లో ఈ కామెడీ షో ప్రయోగాత్మకంగా మొదలైంది. పెద్దగా పేరు లేని వెండితెర కమెడియన్స్ టీమ్ లీడర్స్ గా, నాగబాబు, రోజా జడ్జెస్ గా రంగంలోకి దిగారు. అనసూయ అనే ఒక కొత్త యాంకర్ ప్రేక్షకులకు పరిచయమైంది. జబర్దస్త్ అనతి కాలంలో ఆదరణ దక్కించుకుంది. అదే సమయంలో మొహమాటం లేకుండా స్కిన్ షో చేస్తున్న అనసూయ పిచ్చ పాపులారిటీ తెచ్చుకుంది.

    అనసూయకు ముందు తెలుగులో శ్రుతి మించి గ్లామర్ షో చేసింది లేదు. అనసూయ పొట్టి బట్టలు పెద్ద చర్చకు దారి తీశాయి. అనేక విమర్శలు వెల్లువెత్తాయి. అనసూయ మాత్రం వెనక్కి తగ్గింది లేదు. పైగా తనని తాను సమర్థించుకుంది. దాదాపు 9 ఏళ్ళు జబర్దస్త్ షోలో అనసూయ కొనసాగింది. జబర్దస్త్ తో వచ్చిన ఫేమ్ తో ఇతర ఛానల్స్ లో ఆమెకు ఆఫర్స్ వచ్చాయి. అదే సమయంలో నటిగా అనసూయ బిజీ అయ్యారు.

    వెండితెర అవకాశాలు పెరిగాక బుల్లితెరకు గుడ్ బై చెప్పింది అనసూయ. షూటింగ్ షెడ్యూల్స్, డేట్స్ కారణంగా యాంకరింగ్ మానేస్తున్నట్లు వివరణ ఇచ్చింది. అనంతరం ఓ సోషల్ మీడియా చాట్ లో మనసులో మాట బయటపెట్టింది. మళ్ళీ యాంకరింగ్ ఎప్పుడు చేస్తారని అడగ్గా… నిర్వాహకులు చెత్త టీఆర్పీ స్టంట్స్ మానుకునేవరకు నేను యాంకరింగ్ చేయను. బుల్లితెరకు రాను అన్నారు. అది జరగని పని కనుక… ఎప్పటికీ రానని హింట్ ఇచ్చింది.

    అలాగే జబర్దస్త్ కమెడియన్స్ మీద అనసూయ ఆరోపణలు చేసింది. తనపై బాడీ షేమింగ్ కి పాల్పడ్డారు. నేను కోప్పడితే అది చూపించేవారు కాదు. ఎడిటింగ్ లో తీసేసేవారని అనసూయ అన్నారు. పరోక్షంగా తాను జబర్దస్త్ ఎందుకు మానేసిందో చెప్పింది. ఇకపై బుల్లితెరపై కనిపించేది లేదని చెప్పిన అనసూయ ఇటీవల రీ ఎంట్రీ ఇచ్చింది. కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ పేరుతో స్టార్ మా లో ఓ గేమ్ షో మొదలైంది. ఈ షోలో అనసూయ రెచ్చిపోయింది. ఏకంగా ఒంటి మీద జాకెట్ తీసి రచ్చ చేసింది. నిజానికి అనసూయ జాకెట్ తీసేయడం పక్కా టీఆర్పీ స్టంట్. ఒకప్పుడు చెత్త టీఆర్పీ స్టంట్స్ అన్న అనసూయ అదే పని చేసింది. బుల్లితెరకు మళ్ళీ వచ్చేది లేదని చెప్పి మాట తప్పింది.