Telangana Cabinet: తెలంగాణ కేబినెట్‌ విస్తరణకు ముహూర్తం ఫిక్స్‌.. ఎవరెవరికి ఛాన్స్‌ అంటే..

జూలై 23 నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సమావేశాల ప్రారంభానికి ముందే కేబినెట్‌ విస్తరణ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు.

Written By: Raj Shekar, Updated On : July 2, 2024 12:42 pm

Telangana Cabinet

Follow us on

Telangana Cabinet: తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కేబినెట్‌ విస్తరణపై ఫోకస్‌ పెట్టింది. డిసెంబర్‌ 7న సీఎంగా ప్రమాణం చేసిన రేవంత్‌రెడ్డి 11 మందిని కేబినెట్‌లోకి తీసుకున్నారు. ఉమ్మడి జిల్లాల నుంచి పలువురికి మంత్రులుగా అవకాశం కల్పించారు. ఇంకా ఆరు పదవులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టిపెట్టారు. మరోవైపు మంత్రి పదవుల కోసం ఎమ్మెల్యేలు పైరవీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేబినెట్‌ కూర్పుపై సీఎం అధిష్టానంతోనూ సంప్రదింపులు జరిపారు. ఎవరెవరిని కేబినెట్‌లోకి తీసుకోవాలో ఖరారు చేశారు. వారిక కేటాయించే శాఖలపై కూడా క్లారిటీ వచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కేబినెట్‌ విస్తరణకు ముహూర్తం ఫిక్స్‌ అయింది.

జూలై 4న కేబినెట్‌ విస్తరణ?
జూలై 23 నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సమావేశాల ప్రారంభానికి ముందే కేబినెట్‌ విస్తరణ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. జూలై 4న కేబినెట్‌ విస్తరణకు ముహూర్తం ఫిక్స్‌ చేశారని తెలుస్తోంది. కేబినెట్‌ విస్తరణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈమేరకు ఇప్పటికే అధిష్టానం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చినట్లు గాంధీభవన్‌ వర్గాలు తెలిపాయి.

గవర్నర్‌తో మంతనాలు..
సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం(జూలై 1న) రాష్ట్ర గవర్నర్‌ రాధాకృష్ణన్‌తో భేటీ అయ్యారు. సుమారు గంటన్నపాటు జరిగిన లంచ్‌ మీటింగ్‌లో బడ్జెట్‌ సమావేశాలతోపాటు కీలక బిల్లుల ఆమోదంపై చర్చించారు. ఈ క్రమంలోనే కేబినెట్‌ విస్తరణ విషయాన్ని కూడా గవర్నర్‌కు తెలిపినట్లు సమాచారం. ఈమేరకు జూలై 4న అందుబాటులో ఉండాలని గవర్నర్‌ను సీఎం కోరినట్లు తెలసింది. ఈ క్రమంలో మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి మరోమారు ఢిల్లీ వెళ్లారు. ఫైనల్‌ లిస్ట్‌పై అధిష్టానంతో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

వీరికి ఛాన్స్‌…
కేబినెట్‌ విస్తరణలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పి.సుదర్శన్‌రెడ్డి, వాకిటి శ్రీహరి పేర్లు దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచి ప్రేమ్‌సాగర్‌రావు, వివేక్‌ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం ఇద్దరిలో ఒకరి పేరు ఫైనల్‌ అయ్యే అవకాశం ఉంది. విస్తరణ తర్వాత శాఖలను కూడా మారుస్తారని తెలుస్తోంది.