Jagan: జగన్ పై దూసుకు వచ్చిన వ్యక్తి.. భద్రత సిబ్బంది ఏం చేశారంటే.. వైరల్ వీడియో

ఈ ఎన్నికల్లో వైసీపీకి దారుణ పరాజయం ఎదురైంది. అందుకే వరుసగా పార్టీ శ్రేణులతో సమావేశం అవుతున్న జగన్ భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తున్నారు. ముఖ్యంగా వైసిపిని సమూలంగా ప్రక్షాళన చేయాలని భావిస్తున్నారు. అందులో భాగంగా పార్టీ నియోజకవర్గ బాధ్యులను మార్చుతున్నారు. రేపు వైయస్సార్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన తర్వాత కీలక నిర్ణయాలను వెల్లడించనున్నారు. ఈ నెల మూడో వారంలో అసెంబ్లీ సమావేశాల తర్వాత ప్రజల్లోకి వెళ్లాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు.

Written By: Dharma, Updated On : July 7, 2024 1:36 pm

Jagan

Follow us on

Jagan: కడప: ఏపీ మాజీ సీఎం జగన్ మూడు రోజులపాటు కడప జిల్లాలో పర్యటించుచున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించారు. అక్కడి నుంచి బెంగళూరు వెళ్ళిన జగన్ ఐదు రోజులపాటు అక్కడే గడిపారు. తరువాత తాడేపల్లి కి చేరుకున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. రేపు వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా నివాళులు అర్పించేందుకు ఇడుపులపాయ వెళ్ళనున్నారు. ఈరోజు కడప జిల్లాకు చేరుకున్నారు. వేంపల్లి లో టిడిపి శ్రేణుల దాడిలో గాయపడి కడప రిమ్స్ లో చికిత్స పొందుతున్న వైసిపి కార్యకర్తను పరామర్శించారు. ఆ సమయంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి జగన్ వద్దకు దూసుకొచ్చాడు. భద్రతా సిబ్బంది వారించడంతో వెనక్కి తగ్గాడు.

* కీలక నిర్ణయాలు దిశగా..
ఈ ఎన్నికల్లో వైసీపీకి దారుణ పరాజయం ఎదురైంది. అందుకే వరుసగా పార్టీ శ్రేణులతో సమావేశం అవుతున్న జగన్ భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తున్నారు. ముఖ్యంగా వైసిపిని సమూలంగా ప్రక్షాళన చేయాలని భావిస్తున్నారు. అందులో భాగంగా పార్టీ నియోజకవర్గ బాధ్యులను మార్చుతున్నారు. రేపు వైయస్సార్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన తర్వాత కీలక నిర్ణయాలను వెల్లడించనున్నారు. ఈ నెల మూడో వారంలో అసెంబ్లీ సమావేశాల తర్వాత ప్రజల్లోకి వెళ్లాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులపై దాడులు పెరుగుతున్నాయి. దాడులతో పాటు కేసులు ఆపాలని చంద్రబాబు సర్కార్ కు అల్టిమేటం జారీ చేశారు జగన్. ఆపకపోతే సీరియస్ గా రియాక్షన్ ఉంటుందని కూడా హెచ్చరించారు. అదే సమయంలో పార్టీలో చేర్పు మార్పులు పై కూడా దృష్టి పెట్టారు.

* కార్యకర్తకు పరామర్శ..
వైసీపీ ఓటమి తర్వాత రెండోసారి కడప జిల్లాలో పర్యటిస్తున్నారు జగన్. కడప రిమ్స్ లో టిడిపి శ్రేణుల దాడిలో గాయపడిన పార్టీ కార్యకర్తను పరామర్శించేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా జగన్ మీదకు ఓ వ్యక్తి దూసుకొచ్చాడు. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. అతడిని అడ్డగించి పక్కకు తీసుకెళ్లారు. అయితే తాను జగన్ తో సెల్ఫీ దిగేందుకు మాత్రమే వచ్చానని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆ వ్యక్తిని వదిలేయాలని జగన్ సైతం భద్రతా సిబ్బందికి సూచించారు. మారిన రాజకీయాల నేపథ్యంలో.. జగన్ భద్రత కుదించిన వేళ.. ఓ వ్యక్తి దూసుకు రావడం వైసిపి శ్రేణుల్లో ఆందోళన నింపింది. కానీ సెల్ఫీ కోసమే అతడు ప్రయత్నించాడని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.