Botsa Satyanarayana-YS Jagan
YSR Congress Party : అసెంబ్లీ సమావేశాలకు( assembly sessions ) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హాజరుపై ఫుల్ క్లారిటీ వచ్చింది. ఈరోజు సభకు హాజరయ్యారు జగన్మోహన్ రెడ్డి. పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి శాసనసభకు వచ్చారు. అప్పటికే గవర్నర్ ప్రసంగం కొనసాగుతోంది. ఈ క్రమంలో అక్కడికి దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని సైతం బహిష్కరించి బయటికి వచ్చేశారు. ప్రతిపక్ష హోదా ఇచ్చేవరకు సభలో అడుగు పెట్టమని తెలిసి చెప్పారు. అయితే బడ్జెట్ ప్రవేశ పెట్టే రోజు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు హాజరవుతారని అంతా భావించారు. దానిపై కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే ఆలోచన లేదని.. అందుకే శాశ్వతంగా శాసనసభ సమావేశాలను బహిష్కరిద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు జగన్. 2029 ఎన్నికల వరకు బయట జనాల్లో సమస్యలపై పోరాటం చేద్దామని చెప్పుకొచ్చారు.
* షాక్ ఇచ్చిన జగన్
అయితే శాసనమండలిలో( assembly Council) వైసిపి సభ్యులు హాజరవుతారని ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి. వాస్తవానికి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత శాసనసభకు వచ్చారు జగన్. పులివెందుల శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. తరువాత ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న సాకుతో సభకు హాజరు కాలేదు. ఈరోజు మాత్రం బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో హాజరవుతారని అంతా భావించారు. అందరూ భావించినట్టే జగన్ శాసనసభ సమావేశాలకు వచ్చారు. కానీ గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించి బయటకు వెళ్ళిపోయారు. ఇకనుంచి ఎమ్మెల్యేలు ఎవరు శాసనసభ సమావేశాలకు హాజరు కారని.. ఎమ్మెల్సీలు మాత్రం శాసనమండలి సమావేశాలకు హాజరవుతారని ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
* మండలిలో వైసీపీ దే పై చేయి
ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి ఓ 30 మంది వరకు ఎమ్మెల్సీలు ఉన్నారు. మండలిలో ఆ పార్టీ దే ఎక్కువ బలం. వాస్తవానికి 45 మంది వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీలు ఉండేవారు. ఎన్నికల కు ముందు ఓ నలుగురు పార్టీకి దూరమయ్యారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఓ ఆరేడుగురు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్సీ పదవులకు సైతం రాజీనామా చేశారు. కానీ వారి రాజీనామాలు ఆమోదానికి నోచుకోలేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మోసేన్ రాజు మండలి చైర్మన్ గా ఉండడంతో ఆయన ఈ రాజీనామాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. అయితే మండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన బలం ఉండడంతో దానిని వేదికగా చేసుకుని రాజకీయాలు చేయాలని జగన్ భావిస్తున్నారు.
* బొత్స సారధ్యంలో.. శాసనమండలిలో( assembly Council) వైసిపి పక్ష నేతగా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఉన్నారు. మండలిలో ఆయనకు విపక్ష నేత హోదా ఉంది. అది క్యాబినెట్ తో సమానం. మరోవైపు శాసనమండలి చైర్మన్ కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి. దీంతో శాసనమండలి సమావేశాలకు వైసీపీ సభ్యులు హాజరుకావాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. బొత్స నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించాలని ఎమ్మెల్సీలకు ఆదేశించారు జగన్మోహన్ రెడ్డి. మొత్తానికి అయితే తాను తప్పుకొని ఆ బాధ్యతలను బొత్సకు అప్పగించారు. బయట ఉండి ప్రభుత్వంపై యుద్ధం చేస్తానని.. కానీ మండలి వేదికగా చేసుకుని ప్రభుత్వంపై యుద్ధం చేసే బాధ్యతను బొత్సకు అప్పగించారు జగన్మోహన్ రెడ్డి.