Chhava Collection: విక్కీ కౌశల్(Vicky Kaushal), రష్మిక(Rashmika Mandana) హీరో హీరోయిన్లు గా నటించిన ‘చావా'(Chhaava Movie) చిత్రం ఇటీవలే విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ని ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన ఈ సినిమాకి ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఓపెనింగ్స్ లో సునామీ రేంజ్ ని తలపించిన ఈ సినిమా లాంగ్ రన్ లో కూడా అదే స్థాయి రెస్పాన్స్ ని దక్కించుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. ముఖ్యంగా మహారాష్ట్ర సర్క్యూట్ లో ఈ సినిమాకి వస్తున్న వసూళ్లు ‘పుష్ప 2’ కి కూడా రాలేదట. శనివారం రోజున(9వ రోజు) ఈ చిత్రానికి 44 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు రావడంతో ఒక్కసారిగా అందరూ షాక్ కి గురి అయ్యారు. ఇక ఆదివారం రోజున ఈ చిత్రం కచ్చితంగా 60 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబడుతుందని అందరూ అనుకున్నారు.
కానీ ఈ చిత్రం పై ఇండియా వెర్సస్ పాకిస్తాన్(India vs Pakisthan) క్రికెట్ మ్యాచ్ చాలా బలమైన ప్రభావం చూపించింది. ఫలితంగా పదవ రోజు 60 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టేంత సత్తా ఉన్న ఈ సినిమా, కేవలం 41 కోట్ల రూపాయలకు మాత్రమే పరిమితమైందని, దాదాపుగా 20 కోట్ల నష్టం వాటిల్లిందని విశ్లేషకులు అంటున్నారు. నిన్న దుబాయి లో జరిగిన ఈ క్రికెట్ మ్యాచ్ ని కేవలం హాట్ స్టార్ యాప్ లోనే 70 కోట్ల మంది భారతీయులు వీక్షించారు. ఇక టెలివిజన్ ద్వారా ఎంత మంది వీక్షించి ఉంటారో మీ ఊహలకే వదిలేస్తున్నాం. అందరూ క్రికెట్ మ్యాచ్ కి అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్లే ‘చావా’ కి నష్టం వాటిల్లింది. ఓవరాల్ గా చావా రెండవ వీకెండ్ లో 103 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రానికి రెండవ వీకెండ్ లో 120 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చాయి. నిన్న మ్యాచ్ లేకపోయి ఉండుంటే కచ్చితంగా ఈ రికార్డు ని ‘చావా’ చిత్రం బద్దలు కొట్టి ఉండేదని అంటున్నారు బాలీవుడ్ ట్రేడ్ పండితులు. ఓవరాల్ గా పది రోజులకు గాను చావా చిత్రం 334 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. కేవలం ఇండియా లో మాత్రమే కాదు, ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రానికి భారీ వసూళ్లు వస్తున్నాయి. కేవలం నార్త్ అమెరికా నుండే ఈ చిత్రానికి పది రోజుల్లో 4 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఓవరాల్ ఓవర్సీస్ లెక్కలు చూస్తే దాదాపుగా 14 మిలియన్ డాలర్లు వచ్చినట్టు చెప్తున్నారు. ఫుల్ రన్ లో కచ్చితంగా 20 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.