BJP: మ్యాజిక్ ఫిగర్ కు దూరంగా బిజెపి.. చంద్రబాబే శరణ్యమా

మరోవైపు కేంద్రంలో ఎన్డీఏ మ్యాజిక్ ఫిగర్ కు అల్లంత దూరంలో నిలిచిపోతుందని సంకేతాలు వస్తున్నాయి. ఆరు విడతల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో బిజెపికి అనుకున్న సీట్లు రావని అంచనాలు ఉన్నాయి.

Written By: Dharma, Updated On : May 26, 2024 12:15 pm

BJP

Follow us on

BJP: చంద్రబాబు దశ మారనుందా? ఆయనకు పూర్వవైభవం దక్కనుందా? గతంలో మాదిరిగా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పనున్నారా? ఏపీలో అధికారంలోకి రావడంతో పాటు కేంద్రంలో కీలకంగా మారనున్నారా? పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. గత కొద్ది రోజులుగా ఆయన తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా, నవ్యాంధ్రప్రదేశ్ తొలి సీఎం గా పదవి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు.. 2019 నుంచి2024 వరకు.. రాజకీయంగా చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు. ఒకానొక దశలో తెలుగుదేశం ఉనికి ప్రశ్నార్ధకమవుతుందని విశ్లేషణలు వచ్చాయి. కానీ వాటన్నింటినీ అధిగమించి.. ఈ ఎన్నికల్లో విజయం అంచున టిడిపి కూటమిని నిలబెట్టడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు.

మరోవైపు కేంద్రంలో ఎన్డీఏ మ్యాజిక్ ఫిగర్ కు అల్లంత దూరంలో నిలిచిపోతుందని సంకేతాలు వస్తున్నాయి. ఆరు విడతల్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో బిజెపికి అనుకున్న సీట్లు రావని అంచనాలు ఉన్నాయి. ఈ తరుణంలో మిత్రులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న చిన్నాచితక పార్టీల అవసరం ఏర్పడుతుంది. అయితే గత పది సంవత్సరాలుగా బిజెపి బాధిత పార్టీలే అధికం. బిజెపి మూలంగా చాలా పార్టీలు రాష్ట్రాల్లో అధికారానికి దూరమయ్యాయి.ఇప్పుడు అటువంటి పార్టీల అవసరమే బిజెపికి వస్తోంది.

గత పది సంవత్సరాలు పాటు దేశాన్ని ఏలిన ప్రధాని మోదీ, అమిత్ షా ద్వయం మాట వింటేనే చాలా రాజకీయ పార్టీలు ఆగ్రహంగా ఉన్నాయి.ఇటువంటి తరుణంలో చంద్రబాబు అవసరం బిజెపికి ఏర్పడింది. రెండు దశాబ్దాల కిందటే జాతీయస్థాయిలో కూటములు కట్టడంలో చంద్రబాబు పాత్ర ఇప్పటికీ గుర్తుండిపోతుంది.అప్పట్లోనరేంద్ర మోడీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి మాత్రమే.ఆ సమయంలోనే ఎన్డీఏ కన్వీనర్ గా చంద్రబాబు వ్యవహరించారు. అప్పటి ప్రధాని వాజ్పేయి కిమద్దతుగా నిలిచారు. క్లిష్ట సమయాల్లో కూడా గట్టెక్కించగలిగారు. దానిని గుర్తు చేసుకునే ప్రధాని మోదీ చంద్రబాబు సాయం తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. అవసరమైతే ఎన్డీఏ కన్వీనర్ పదవి చంద్రబాబుకు అప్పగిస్తారని టాక్ నడుస్తోంది .

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్డీఏ కు 250 సీట్లు రావడం గగనం. అదే సమయంలో ఇండియా కూటమికి 200 స్థానాలు వరకు వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మిగతా 125 ఎంపీల అవసరం కీలకం. వారిని దారిని తెచ్చుకునేందుకు చంద్రబాబు అవసరం. అటు ఇండియా కూటమిలో కీలక పార్టీలఅధినేతలతో చంద్రబాబుకు మంచి సన్నిహిత్యం ఉంది.వారిపై చంద్రబాబును ప్రయోగించాలని.. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చి.. పాలన సవ్యంగా సాగించాలని మోడీ భావిస్తున్నారు. అందుకే చంద్రబాబుతో ఉన్న పాత వైరాన్ని మరిచి.. ఎన్డీఏలో కీలక బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. జూన్ 4న వచ్చే ఫలితాలకు అనుగుణంగా బిజెపి అగ్రనేతల నిర్ణయాలు ఉంటాయని సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.