https://oktelugu.com/

Rave Party: రేవ్ పార్టీ డొంక కదిలింది.. ఆ పార్టీ మెడకు చుట్టుకుంది!

కొద్దిరోజుల కిందట బెంగళూరులో ఓ రిసార్ట్లో రేవ్ పార్టీ జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.మొత్తం 86 మంది పట్టుబడ్డారు.ఇందులో 59 మంది పురుషులు కాగా.. 27 మంది మహిళలు ఉన్నారు.

Written By:
  • Dharma
  • , Updated On : May 26, 2024 / 12:11 PM IST

    Rave Party

    Follow us on

    Rave Party: బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి డొంక కదులుతోంది. కొద్దిరోజులు కిందట బెంగళూరు రేవ్ పార్టీలో చాలామంది పట్టుబడిన సంగతి తెలిసిందే. అందులో చాలామంది సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులుఉన్న సంగతి విధితమే.అయితే ఈ రేవ్ పార్టీ సూత్రధారులుఏపీలో అధికార పార్టీకి చెందిన వ్యక్తులని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పోలీసులకు ఏపీ మంత్రి కాకాని గోవర్ధన రెడ్డి స్టిక్కర్ తో కూడిన కారు ఒకటి పట్టుబడినట్లు సమాచారం. మరో వైపు రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అనుచరుల సైతం ఈ ముఠాలో ఉన్నట్లు టాక్ నడుస్తోంది.

    కొద్దిరోజుల కిందట బెంగళూరులో ఓ రిసార్ట్లో రేవ్ పార్టీ జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.మొత్తం 86 మంది పట్టుబడ్డారు.ఇందులో 59 మంది పురుషులు కాగా.. 27 మంది మహిళలు ఉన్నారు. తెలుగు సినీ రంగానికి చెందిన హేమతో పాటు 8 మందికి బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 27న విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే తాము హైదరాబాదులో ఉన్నట్లు హేమతో పాటు పలువురు నటులు నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ వారంతా రేవ్ పార్టీలో పట్టుబడినట్లు బెంగళూరు పోలీసులు ధృవీకరించారు.

    కాగా ఈ రేవ్ పార్టీకి సంబంధించి సూత్రధారులు,పాత్రధారులు ఏపీలో అధికార వైసీపీకి చెందిన వారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ పార్టీ నిర్వాహకుడిగా వాసు ఉండగా, హైదరాబాద్కు చెందిన పూర్ణారెడ్డి అనే వ్యక్తి పేరు బయటపడింది. వీరు ఏపీకి చెందిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, వైసీపీ శ్రీకాంత్ రెడ్డి అనుచరులని టాక్ నడుస్తోంది. అయితే ఇప్పటికే రేవ్ పార్టీకి సంబంధించి నిర్వాహకులు మీ పార్టీ వారంటే.. మీ పార్టీ వారేనని ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో.. మంత్రి గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్ తో కూడిన కారు పోలీసులు స్వాధీనం పరుచుకోవడం సంచలనం రేకెత్తిస్తోంది. ఇదో రాజకీయ అంశంగా మారిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.