Balineni Srinivas Reddy: రాజకీయాల్లో( politics) ఏదైనా సాధ్యమే? ఎంతటి వారికైనా జయ అపజయాలు ఎదురవుతుంటాయి. ఇందిరాగాంధీ లాంటి నేత ఎంపీగా ఓడిపోయారు. నందమూరి తారక రామారావు లాంటి నాయకుడు ఎమ్మెల్యేగా ఓడిపోయారు. అంతెందుకు ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. రాజకీయాల్లో ఒక ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. ఆ ట్రెండ్ కు తగ్గట్టు మనము నడుచుకోవాల్సి ఉంటుంది. గెలుపు ఓటములను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే కొందరు జేజేతులా తమ పరిస్థితిని దిగజార్చుకుంటారు. ఇప్పుడు కూడా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అదే పరిస్థితి తెచ్చుకున్నారు అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక వెలుగు వెలిగారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. ప్రస్తుతం జనసేనలో ఉన్న ఆయన ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నాయి.
* మహానేత ప్రోత్సాహంతో..Balineni Srinivas Reddy
రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి( balineni Srinivasa Reddy ). తన తోడల్లుడు వైవి సుబ్బారెడ్డి కి సమీప బంధువు కావడంతో రాజశేఖరరెడ్డి ఎనలేని ప్రాధాన్యమిచ్చారు. సుబ్బారెడ్డి బదులు బాలినేని రాజకీయంగా ప్రోత్సహించారు. 2004లో ఎమ్మెల్యే టికెట్ కట్టబెట్టారు. చిన్న వయసులోనే అసెంబ్లీలో అడుగు పెట్టేలా చేశారు. 2009లో రెండోసారి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ప్రోత్సహించారు. గెలిచేసరికి మంత్రిగా అవకాశం ఇచ్చారు. అటు తరువాత తన పొలిటికల్ జర్నీ అంత జగన్మోహన్ రెడ్డితో కొనసాగింది. సరైన గౌరవం దక్కుతూ బాలినేని సైతం గుర్తింపు పొందారు.
* మంత్రి పదవి వదులుకొని..
వైయస్సార్ కాంగ్రెస్( ysr Congress) పార్టీ ఆవిర్భావంతో జగన్ వెంట అడుగులు వేశారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. ఇంకా నాలుగు సంవత్సరాల మంత్రి పదవి ఉండగానే వదులుకున్నారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచారు. 2014లో మాత్రం ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో గెలిచి జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్నారు. జగన్మోహన్ రెడ్డికి దగ్గరైన వ్యక్తులు ఒకరుగా నిలిచారు. తనకు కావాల్సిన పనులు ఆయన పట్టుబట్టి మరి చేయించుకునేవారు. అయితే విస్తరణలో భాగంగా బాలినేని తన మంత్రి పదవిని కోల్పోయారు. అప్పటినుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉన్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్టీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరారు.
* జనసేన ప్లీనరీలో..
అయితే జనసేనలో( janasena ) బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఆశించిన స్థాయిలో పెద్దగా ఆదరణ లేదని ప్రచారం సాగుతోంది. అందుకు తగ్గట్టుగానే జనసేన ప్లీనరీలో సేమ్ సీన్ కనిపించింది. వేదికపై ఆయన ముందు వరుసలో కాకుండా.. వెనుక వరుసలో కూర్చోవడం రాజకీయంగా హాట్ టాపిక్ అవుతోంది. ఏమాత్రం రాజకీయ అనుభవం లేని నాయకులు ముందు వరుసలో ఉన్నారు. బాలినేని మాత్రం వెనుక వరుసలో ఉన్నారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తన సోషల్ మీడియాకు పని చెప్పింది. జగనన్న గుండెల్లో సముచిత స్థానం వదిలేసి.. అధికారం కోసం వెళ్లి ద్వితీయ శ్రేణి నాయకులతో కూర్చున్నావ్.. ఆత్మాభిమానం ఇప్పుడు ఏం అయింది బాలినేని? అంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయనను ప్రశ్నిస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
జగనన్న గుండెల్లో సముచిత స్థానం వదిలేసి… అధికారం కోసం వెళ్లి ద్వితీయ శ్రేణి నాయకులతో కూర్చునావ్… ఆత్మాభిమానం ఎపుడు ఏం అయింది బాలినేని pic.twitter.com/2GNQn0CXHj
— YS Jᴀɢᴀɴ Dᴇᴠᴏᴛᴇᴇs (@YsJagan_devotes) March 14, 2025