Failure Story : ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలు అవుతాయనే సామెత వినే ఉంటారు. ఈ సామెత బిజినెస్ ప్రపంచంలో చాలా చక్కగా సరిపోతుంది. సామాన్యుడి నుంచి ఓ బడా సామ్రాజ్యాన్ని సృష్టించిన వాళ్లు ఉన్నారు. అలాగే ఓ పెద్ద సామ్రాజ్యాన్ని చేజేతులా కుప్పకూల్చుకున్న వాళ్లు ఉన్నారు. అలాటి ఓ మాజీ బిజినెస్ టైకూన్ స్టోరీ గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. భవగుత్తు రఘురామ్ శెట్టి అలియాస్ బీఆర్ శెట్టి.. ఈ పేరు వినే ఉంటారు. కర్ణాటకలో పుట్టి దుబాయ్ లో స్థిరపడిన బిజినెస్ మ్యాన్. ఓ దశలో కోట్లకు పడగలెత్తి.. ప్రస్తుతం దివాళా తీశారు. . ఆయనకు చెందినటువంటి Finablr Plc వ్యాపారాన్ని కేవలం ఒక్క డాలర్‌కే (రూ.74) విక్రయించారు.రెండేళ్ల కిందట ఈ కంపెనీ విలువ ఏకంగా రెండు బిలియన్ డాలర్లు. ఈ సంస్థకు ఒక బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా ప్రకటించని రుణాలు ఉన్నాయని గతేడాది ఏప్రిల్ లో తేలింది.
Also Read : అప్పట్లో నోకియా ఒక రేంజ్ ఉండేది… ఇప్పుడు ఎందుకు విఫలమైందో తెలుసా?
ఆయన అప్పట్లో లగ్జరీ లైఫ్ నకు పెట్టింది పేరు. శెట్టి ఎక్కడికి వెళ్లాలన్నా ప్రైవేట్ జెట్ లోనే ప్రయాణించే వారు. దుబాయ్‌లోని అత్యంత ఖరీదైన భవనం బుర్జ్ ఖలిఫాలో రెండు అంతస్తులు పూర్తిగా ఆయన సొంతం. పొలిటికల్ లీడర్స్, బాలీవుడ్ నటీనటులతోనే ఆయన పరిచయాలు. ఒకప్పుడు కింగ్ గా వెలిగిపోయారు. ఇందంతా గతం.. ప్రస్తుతం ఆయన ఆస్తులన్నీ కుప్పకూలిపోయాయి. బిలీనియర్ స్థాయి నుంచి మిలీనియర్ స్థాయికి పడిపోయాడు. ఆయన దర్పం దర్జా అంతా నకిలీనే అని తేలిపోయింది.
విలాసవంతమైన జీవితాన్ని అనుభవించేందుకు ఆయన మాయాజాలం చేశాడు. తన దగ్గర పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నట్లు శెట్టి రకరకాల డాక్యుమెంట్లు తయారు చేసి అందరికి చూపించాడు. ఆయన ఆటలకు కార్సన్ బ్లాక్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ మడ్డీ వాటర్స్ చెక్ పెట్టేసింది. శెట్టి సంస్థల్లోని అకౌంట్లలో తారు మారు జరిగిందని విమర్శలు చేసింది. దీంతో బీఆర్ శెట్టికి ఎదురుదెబ్బ తగిలింది.
దీంతో ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఎహుద్ ఓల్మెర్ట్‌తో సంబంధం ఉన్న గ్లోబల్ ఫిన్‌టెక్, అబుదాబీకి చెందిన రాయల్ స్ట్రాటజిక్ పార్ట్‌నర్స్ కన్సార్టియం ఒక్క డాలర్‌కే కొనుగోలు చేసింది. ఇజ్రాయెల్, యూఏఈ మధ్య సంబంధాలు గతేడాది ఆరంభంలోనే సాధారణ స్థితికి తీసుకుని వచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఫినాబ్‌లర్ పీఎల్‌సీ సంస్థ చెల్లింపులు, ఫారిన్ ఎక్స్ఛేంజీ సొల్యూషన్స్ సర్వీసులు అందజేస్తుంది. కొన్నాళ్ల క్రితం కుంభకోణాల్లో కూరుకుపోయింది. శెట్టి ఇప్పుడు దుబాయ్ లో లీగల్ సమస్యలను ఎదుర్కొన్నారు. ఆయనకు భారత రాజకీయాలతో కూడా ఆయనకు సంబంధాలు ఉండేవి.
రాజకీయాల నుంచి మెడికల్ రిప్రెజెంటేటివ్ గా మారి 1973లో దుబాయ్ వెళ్లారు. 20ఏళ్ల క్రితం దుబాయ్ లో ఓ చిన్న క్లినిక్‌ను ప్రారంభించారు. అనతి కాలంలోనే అది పవర్ ఫుల్ హెల్త్ సర్వీష్ సామ్రాజ్యంగా మారిపోయింది. 45 హాస్పిటళ్లకుపైగా ఈ సంస్థకు సంబంధాలు ఉన్నాయి. కానీ అప్పులను బహిర్గతం చేయకపోవడంతో కంపెనీ ఆర్థిక చిక్కుల్లో కూరుకుపోయింది. దీంతో కేవలం రూ.74 రూపాయలకే శెట్టి తన కంపెనీని వదులుకున్నారు.
2016లో బీఆర్ శెట్టి దంపతులు అప్పటి సీఎం చంద్రబాబును కూడా కలిశారు. హెల్త్ కేర్ రంగంలో ఏపీలో రూ.12వేల కోట్లు పెట్టుబడుల పెడతామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా ఒక హెల్త్ యూనివర్శిటీ, టూరిజం, హాస్పిటాలిటీ, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. పది వేల మంది కూర్చునే కెపాసిటీతో ఓ కన్వెన్షన్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామ అది దేశంలోనే అతి పెద్దది అవుతుందన్నారు. ఏపీలో 3500 పడకల ఆస్పత్రితో పాటు గోల్ఫ్ కోర్సులను కూడా ఏర్పాటు చేసేందుకు ఒప్పందం జరిగింది. వీటికి భూములు కూడా కేటాయించింది చంద్రబాబు ప్రభుత్వం. కానీ ప్రస్తుత ఆయన పరిస్థితి దారుణంగా మారిపోయింది.
Also Read : నేనూ జీవితంలో, చదువులో చాలా సార్లు ఫెయిల్ అయ్యా : అదానీ బయటపెట్టిన సీక్రెట్స్