Tata Tiago : దేశంలో టాప్ లెవల్లో ఉన్న కార్ల కంపెనీల్లో TATA ఒకటి. ఈ కంపెనీ నుంచి ఎన్నో మోడళ్లు మార్కెట్లోకి వచ్చి వినియోగదారులను ఆకర్షించాయి. సెడాన్ కార్ల నుంచి ఎస్ యూవీ కార్ల వరకు అందుబాటులోకి వచ్చిన వీటిలో మిడిల్ క్లాస్ పీపుల్స్ కోసం ప్రత్యేకంగా కొన్ని మోడల్స్ ను తయారు చేశారు. వీటిలో Tiago ఒకటి. కార్ల సేల్స్ లో అత్యధికంగా విక్రయాలు జరుపుకునే మారుతి వ్యాగన్ ఆర్ కు టాటా టియాగో పోటీ పడుతోంది. ఈ కారును ఇప్పటికే చాలా మందిని ఆకర్షించింది. అయితే ఈ మోడల్ కొత్త వెర్షన్ లో అందుబాటులోకి వచ్చింది. TaTa Tiago NRG పేరుతో మార్కెట్లోకి వచ్చిన దీని అప్డేట్ ఫీచర్ష్ చూసి వినియోగదారులు షాక్ అవుతున్నారు. అవెలా ఉన్నాయంటే.
Also Read : మైలేజ్‌లో సూపర్.. సేఫ్టీలో బంపర్.. రూ.6 లక్షల్లో అద్భుతమైన కారు!
TaTa Tiago పాత వెర్షన్ వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంది. కొత్త వెర్షన్ డిజైన్ కూడా వేరే లెవల్లో ఉందని చెప్పవచ్చు. కొత్త కారుకు మందం కలిగిన సిల్వర్ స్కిడ్ ప్లేట్ ను అమర్చారు. రీ డిజైన్ చేసిన బంపర్ ను చేర్చారు. షార్క్ ఫిన్ యాంటెన్నా, మస్క్యులర్ టెయిల్ గేట్ ను కలిగి ఉన్న ఈ కారులో 5గురు ప్రయాణికులు సురక్షితంగా వెళ్లొచ్చు. లాంగ్ జర్నీ చేయాలనుకునేవారికి ఇది కన్వినెంట్ గా ఉంటుంది. ఈ కారులో ఇన్నర్ లో కొత్త టచ్ స్క్రీన్ ఇన్పోటైన్మెంట్ సిస్టమ్ తో పాటు ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లు ఉన్నాయి. బటన్ స్టార్ట్ తో ఆకట్టుకుంటుంది.
కొత్త కారు పెట్రోల్ ఇంజిన్ తో పాటు సీఎన్ జీని కూడా చేర్చారు. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను చేర్చారు. ఇది 86 బీహెచ్ పీ పవర్ తో పనిచేస్తుంది. అలాగే 113 ఎన్ ఎం టార్క్ ను రిలీజ్ చేస్తుంది. ఈ ఇంజిన్ లీటర్ ఇంధనానికి 19.43 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. CNG వెర్షన్ లో ఈ మోడల్ 28 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. 5 స్పీడ్ మాన్యువల్ తో పాటు ఆటోమేటిక్ గేర్ బాక్స్ కలిగిన ఇందులో సేప్టీ ఫీచర్స్ కూడా అనుగుణంగా ఉన్నాయి. ప్రస్తుతం కాలంలో చాలా మంది సేప్టీ ఫీచర్స్ కూడా ఎక్కువ మంది కోరుకుంటున్నారు. ఈ తరుణంలో ఈ కొత్త కారులో ABS తో పాటు ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రానిక్ స్టెబిలిట కంట్రోల్ వంటి ఫీచర్ల ఉన్నాయి.
ప్రస్తుత మార్కెట్లో ఈ కారు మారుతి కంపెనీకి చెందిన వ్యాగన్ ఆర్ కు గట్టి పోటీ ఇస్తోంది. అయితే ఈ కొత్త కారు వినియోగదారులను మరింత ఆకట్టుకుంటుందని అంటున్నారు. కొత్త వెర్షన్ మార్కెట్లో రూ.7.2 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. ఆటోమేటిక్ గేర్ బాక్స్ కావాలనకునేవారికి రూ.7.75 చెల్లించాలి. సీఎన్ జీ కారు కోసం రూ.8.2 లక్షలు చెల్లించాలి. తక్కువ ధరలో మంచి ఫీచర్స్ తో పాటు అత్యధిక మైలేజ్ ఇచ్చే కారు కోసం దీనిని ఎంపిక చేసుకోవచ్చని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు.
Also Read : టాటా టియాగో ఈవీలో ఎవరికీ చెప్పకుండా ఈ ఫీచర్ ను యాడ్ చేశారు..