https://oktelugu.com/

AP Cabinet: క్యాబినెట్లో ఖాళీగా ఉన్న మంత్రి పదవి ఆ సీనియర్ కోసమేనా?

రాష్ట్ర మంత్రివర్గంలో 24 మంది మంత్రులు ఉన్నారు. మరో మంత్రి పదవిని ఖాళీగా ఉంచారు. అది ఓ సీనియర్ నేత కోసమేనని ప్రచారం నడుస్తోంది.

Written By:
  • Dharma
  • , Updated On : December 1, 2024 / 08:55 AM IST

    AP Cabinet(1)

    Follow us on

    AP Cabinet: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతోంది. సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు 24 మంది మంత్రులు కొలువుదీరారు. క్యాబినెట్లో ఒక మంత్రి పదవి ఖాళీగా ఉంది. అది ఎవరి కోసమో తెలియడం లేదు. సీనియర్లు చూస్తే చాలామంది ఉన్నారు. ఉత్తరాంధ్ర నుంచి కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, జ్యోతుల నెహ్రూ, చినరాజప్ప, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దూళిపాళ్ల నరేంద్ర.. ఇలా ఒక్కరేంటి చాలామంది నేతలు మంత్రి పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. కానీ చంద్రబాబు మనసులో ఉన్న మాట బయటపడడం లేదు. ఆ ఒక్క మంత్రి పదవి ఎవరికోసం అంటూ చర్చలు సాగుతున్నాయి. ఇప్పటికే కూటమి ఆరు నెలల పాలన ముగిసింది. ఇంకా నాలుగున్నర సంవత్సరాల కాల పరిమితి ఉంది. ఈ లోపల ఆ ఒక్క మంత్రి పదవి భర్తీ చేస్తారా? లేకుంటే విస్తరణతో జూనియర్లకు పక్కన పెట్టి సీనియర్లను తీసుకుంటారా? అన్నది చూడాలి.

    * ఆ ఇద్దరి ఎదురుచూపులు
    ఉత్తరాంధ్రలో కళా వెంకట్రావు తో పాటు గంటా శ్రీనివాసరావు సీనియర్ మోస్ట్ లీడర్లు. కానీ ఈసారి వారికి ఛాన్స్ దక్కలేదు. మరో సీనియర్ నేత అయ్యన్నపాత్రుడికి అసెంబ్లీ స్పీకర్ గా అవకాశం ఇచ్చారు. బండారు సత్యనారాయణమూర్తి సైతం పదవి ఆశిస్తున్నారు. అయితే విజయనగరం జిల్లా కోటా కింద ఇప్పటికే కొండపల్లి శ్రీనివాసరావుకు చాన్స్ ఇచ్చారు చంద్రబాబు. అదే జిల్లా కోటా కింద మంత్రి పదవి ఇవ్వడం కుదరదు. అందుకే ఇప్పట్లో కళా వెంకట్రావుకు చాన్స్ లేనట్టే. ఒకవేళ మంత్రివర్గ విస్తరణలో కొండపల్లి శ్రీనివాస్ రావును పక్కనపెడితే కళా వెంకట్రావుకు అవకాశం దొరుకుతుంది. లేకుంటే మాత్రం అవకాశమే లేదు.

    * క్యాబినెట్లోకి గంటా
    అయితే విశాఖ నుంచి గంటా శ్రీనివాసరావును క్యాబినెట్లో తీసుకునే అవకాశం ఉందని ప్రచారం నడుస్తోంది. విశాఖ జిల్లా నుంచి క్యాబినెట్లో ప్రాతినిధ్యం లేదు. వంగలపూడి అనిత మంత్రివర్గంలో ఉన్నా ఆమె అనకాపల్లి జిల్లా కోటా కిందకు వస్తున్నారు. అయితే విశాఖ విషయానికి వచ్చేసరికి మాత్రం మంత్రివర్గంలో చోటు లేదు. దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే మంత్రి లోకేష్ ప్రత్యేకంగా దృష్టి సారించాల్సి వస్తోంది. అయితే ఖాళీగా ఉన్న ఆ ఒక్క మంత్రి పదవి గంటా శ్రీనివాసరావుకేనని ప్రచారం నడుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.