Indian Railways New Zone Map: ఏపీ ( Andhra Pradesh) విషయంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే ప్రాజెక్టులలో ఏపీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్ ను ఏర్పాటు చేసింది కేంద్రం. ఇప్పుడు తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. డివిజన్ల సర్దుబాటు చేసింది. ఇప్పటివరకు దక్షిణ మధ్య రైల్వే లో కొనసాగిన మూడు డివిజన్లను కొత్త జోన్ పరిధిలోకి చేర్చింది. ఇప్పటికే రైల్వే బోర్డు కు డివిజన్ హద్దులు మార్చాలంటూ ప్రతిపాదనలు కూడా వెళ్లాయి. మరోవైపు గుంటూరు, గుంతకల్ డివిజన్ల పరిధిలో కవచ్ వ్యవస్థ ఏర్పాటుకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ తాజా నిర్ణయంతో దక్షిణ మధ్య రైల్వే జోన్ నిడివి తగ్గనుంది.
Also Read: తిరుమలలో మరో ఘోరం.. భయంలో భక్తజనం
సౌత్ సెంట్రల్ కుదింపు..
విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా( South coastal) ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు అవుతున్న నేపథ్యంలో.. దక్షిణ మధ్య రైల్వే కుదింపు దిశగా కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే జోన్ లో సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్, విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లు ఉన్నాయి. పునర్విభజన తర్వాత సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లు సౌత్ సెంట్రల్ రైల్వేలో మిగులుతాయి. విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లు ఏపీలోని విశాఖ కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తాలో చేరుతాయి. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్, గుంతకల్, విజయవాడ, గుంటూరు డివిజన్ల సరిహద్దుల్లో మార్పులకు గాను ప్రతిపాదనలు వెళ్లాయి.
ఆ ప్రాంతాల్లో చేర్పులు మార్పులు తెలంగాణలో( Telangana) విష్ణుపురం – పగిడిపల్లి.. విష్ణుపురం- జాన్ పహాడ్ సెక్షన్లు ప్రస్తుతం ఏపీలోని గుంటూరు డివిజన్లో ఉన్నాయి. వీటిని సికింద్రాబాద్ డివిజన్లో కలపాలని ప్రతిపాదించారు. కర్ణాటకలోని రాయచూరు, మహారాష్ట్రలోని వాడి మధ్య ఉన్న సెక్షన్ ప్రస్తుతం గుంతకల్ పరిధిలో ఉంది. దీనిని సికింద్రాబాద్లో కలపాలని అధికారులు ప్రతిపాదించారు. భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ లో రాయగడ డివిజన్ ను కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ డివిజన్ పరిధిలోకి ఏపీలో ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాలు రానున్నాయి. జోన్ల పరిధి, డివిజన్ల మార్పు గురించి రైల్వే శాఖ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేయనుంది.
Also Read: ఇప్పటికీ అదే క్రేజ్.. వంగవీటి మోహన్ రంగా స్పెషల్ అదే!
ప్రమాదాల నియంత్రణకు వ్యవస్థ
దేశంలో రైల్వే ప్రమాదాలు( Railway accidents ) పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర రైల్వే శాఖ అప్రమత్తం అయింది. ప్రమాదాల నియంత్రణకు గాను కావచ్చు వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. అందులో భాగంగా గుంటూరు తో పాటు గుంతకల్ డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. ఈ రెండు డివిజన్ల పరిధిలో రూ.204 కోట్లతో ఈ వ్యవస్థ ఏర్పాటు కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. రైళ్ల ప్రమాదాల నియంత్రణకు గాను రైల్వే స్టేషన్లు, లెవెల్ క్రాస్ గేట్లు, ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నల్, రిమోట్ ఇంటర్ ఫెయిల్ యూనిట్ ల వద్ద ఈ కవచ్ ను ఏర్పాటు చేస్తారు.