Vangaveeti Ranga Jayanti 2025: ఏపీ రాజకీయాల్లో( AP politics) ఆయన పెను ప్రపంచం. అలాగని సుదీర్ఘకాలం రాజకీయాలు చేయలేదు. ఎక్కువ రోజులు పదవి చేపట్టలేదు. కేవలం ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యే అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించారు. తెలుగు నేలపై చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన మరణించి 37 సంవత్సరాలు అవుతున్నా.. ఆయన స్ఫూర్తి తెలుగు నేలపై కొనసాగుతూనే ఉంది. ఆయనే ది వన్ అండ్ ఓన్లీ వంగవీటి మోహన్ రంగా.. అలియాస్ రంగా. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వాళ్లు ఉండరు. అంతలా ప్రభావితం చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను. ఏపీలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మోహన్ రంగా పేరు వినిపిస్తూనే ఉంటుంది.
Also Read: టిడిపి ఒంటరిగా సు’పరిపాలన’!
అణగారిన వర్గాల వాయిస్
వంగవీటి మోహన్ రంగాను( vangaveeti Mohan Ranga) ఒక వర్గ నాయకుడిగానే ఇప్పటికీ ముద్రిస్తుంటారు. కానీ ఆయన ఒక వర్గానికి కాదు… బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి. కాపు కుల నాయకుడిగా ముద్రపడినా.. ఆయన అందరివాడు. అణగారిన వర్గాలను సైతం అక్కున చేర్చుకున్నారు. నేను ఉన్నాను అంటూ భరోసా ఇచ్చారు. ఆయన భౌతికంగా దూరమై 37 సంవత్సరాలు అవుతోంది. ఇప్పటికీ అదే జరగని ముద్ర. తరాలు మారుతున్నాయి గానీ.. వంగవీటి మోహన్ రంగా చరిత్ర మాత్రం సజీవంగా ఉంది. నేడు వంగవీటి మోహన్ రంగా జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం.
విజయవాడ కేంద్రంగా
ఉమ్మడి ఏపీలో విజయవాడ( Vijayawada ) ప్రధాన రాజకీయ కేంద్రం. ఈ నగరం చుట్టూ రాష్ట్ర రాజకీయాలు తిరగడం పరిపాటి. ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్లో సైతం విజయవాడ రాజకీయం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అయితే తొలినాళ్లలో వామపక్ష భావజాలం విజయవాడలో అధికం. ప్రధానంగా కార్మిక సంఘాలు, ట్రేడ్ యూనియన్లు క్రియాశీలకంగా ఉండేవి. అటువంటి సమయంలో వంగవీటి కుటుంబం తెరపైకి వచ్చింది. అప్పటివరకు చలసాని రత్నం కార్మిక సంఘాల్లో పట్టున్న వ్యక్తి.
ఆయనతో కలిసి పని చేసింది వంగవీటి కుటుంబం. అయితే క్రమేపి విభేదాలు రావడంతో వంగవీటి సోదరులు సొంతంగా ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. అలా ప్రాబల్యం పెంచుకునే క్రమంలో వంగవీటి రాధా హత్యకు గురయ్యారు. అప్పుడే మోహన్ రంగా తన సోదరుడి స్థానంలో కార్మిక ట్రేడ్ యూనియన్లలో క్రియాశీలక పాత్ర పోషించారు. అలా ప్రాబల్యం పెంచుకున్న మోహన్ రంగా విజయవాడ నగరంలో ప్రభావశీలి అయిన వ్యక్తిగా అవతరించారు. అయితే అప్పటివరకు వంగవీటి కుటుంబంతో కలిసి నడిచిన దేవినేని కుటుంబం విభేదాలతో విడిపోయింది. అప్పటినుంచి విజయవాడలో వర్గ పోరు ప్రారంభం అయింది.
Also Read: విజయసాయి రెడ్డి రీ ఎంట్రీ.. రంగంలోకి కీలక నేత!
రాజకీయ పార్టీల రంగా నామస్మరణ
కార్మిక సంఘాలే కాదు రాజకీయంగా కూడా.. క్రియాశీలకంగా ఉండాలని భావించిన వంగవీటి మోహన్ రంగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. కాంగ్రెస్( Congress) పార్టీలో చేరి 1985 ఎన్నికల్లో విజయవాడ నగరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అదే సమయంలో తన ప్రత్యర్థిగా ఉన్న దేవినేని గాంధీ సైతం కంకిపాడు నుంచి గెలుపొందారు. అయితే ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. సరిగ్గా అటువంటి సమయంలోనే విజయవాడ నగరంలో పేదల ఇళ్ల స్థలాల కోసం వంగవీటి మోహన్ రంగా దీక్షకు దిగారు. 1988 డిసెంబర్ 26న ఆయనను నడిరోడ్డులో దారుణంగా హత్య చేశారు. దాని మూలంగా 1989 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణంగా దెబ్బతింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది. దానికి కారణం కాపు సామాజిక వర్గం. అణగారిన వర్గాల కోసం ఫైట్ చేశారు మోహన్ రంగా.
కానీ కాపులు ఎక్కువగా ఆయనను ఓన్ చేసుకున్నారు. దాని ఫలితంగా ఆయనపై కాపు ముద్రపడింది. కాపు సామాజిక వర్గం ఓట్ల కోసం మోహన్ రంగా పేరు కలవని రాజకీయ పార్టీ లేదు. ప్రజల మనసులో ఇంకా చిరస్థాయిగా ఉన్నారు వంగవీటి మోహన్ రంగా.. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ చనిపోయారు ఆయన. కానీ అదే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కానీ.. రంగాను హత్య చేసిన నిందితులను గుర్తించలేకపోయింది. అలా అన్ని రాజకీయ పార్టీలు మోహన్ రంగా హత్య విషయంలో నిజాలను నిగ్గు తేల్చలేకపోయాయి. ప్రభుత్వాలు ఆయనను మరిచిపోయాయి కానీ.. రాజకీయ పార్టీలు మాత్రం గుర్తిస్తుంటాయి. కానీ ప్రజల గుండెల్లో ఆయన ఎప్పుడు చిరంజీవే.